Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాజ్‌మహల్‌ను సందర్శించిన బెన్ కింగ్స్‌లే

తాజ్‌మహల్‌ను సందర్శించిన బెన్ కింగ్స్‌లే
, గురువారం, 3 డిశెంబరు 2009 (10:32 IST)
FILE
ఆస్కార్ అవార్డు గ్రహీత బాలీవుడ్ చిత్రం " తాజ్ "లో షాజహాన్ పాత్ర పోషిస్తున్న 67 సంవత్సరాల ప్రముఖ హాలీవుడ్ నటుడు బెన్ కింగ్స్‌‍లే తన సతీమణి డేనియేలా లెవేండర్‌తో కలిసి బుధవారం తాజ్‌మహల్‌ను సందర్శించారు.

ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శించిన సందర్భంలో ఆయన "మాంఛి రొమాంటిక్" మూడ్‌లో ఉన్నట్లు కనపడింది. తన సతీమణితో కలిసి పలు భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇతర పర్యాటకులతోను ముచ్చటించి వారికి తన ఆటోగ్రాఫ్‌ను ఇవ్వడం జరిగింది.

బాలీవుడ్ సినిమా " తాజ్ "లో బెన్ షాజహాన్ పాత్రలో కనిపిస్తాడు. అతనికి జోడీగా ప్రముఖ బాలీవుడ్ నటీమణి ఐశ్వర్యారాయ్ " ముంతాజ్ " పాత్రను పోషిస్తోంది. 2007లో వచ్చిన " ది లాస్ట్ లీజన్ " చిత్రంలోను బెన్ ఐశ్వర్యాతో కలిసి నటించాడు.

Share this Story:

Follow Webdunia telugu