Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.. : టీటీడీ ఈవో

కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.. : టీటీడీ ఈవో
, మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (05:40 IST)
శ్రీనివాస మంగాపురంలో ఫిబ్రవరి 10 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తెలిపారు. తిరుపతిలో సోమవారం ఆయన ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా రాజీ పడడానికి వీలు లేకుండా జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యం, భద్రత, వాహన సేవలకు సంబంధించిన అధికారులతో చర్చలు జరిపారు. 
 
ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి తేడా రాకుండా జాగ్రత్తపడాలని కోరారు. ఏర్పాటు చేసే అన్ని పూల ప్రదర్శనలలో భక్తి భావం ఉట్టిపడేలా ఆకర్షణీయంగా ఉండాలని ఉద్యానవన శాఖను ఆదేశించారు. అలాగే ఆలయం భక్తులకు తగినంత ఆహరాన్ని, లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. క్యూలైన్ల నిర్వహణ కోసం శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచాలనీ, వారిని ముందుగానే ఆలయానికి పంపాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu