Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో నాగార్జున.. చేతిని ముద్దుపెట్టుకున్న మహిళ

తిరుమలలో నాగార్జున.. చేతిని ముద్దుపెట్టుకున్న మహిళ
, గురువారం, 7 మే 2015 (08:54 IST)
సినీ హీరో నాగార్జున తిరుమలలో తళుక్కుమన్నారు. ఆయన బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గుడిలో కనిపించడంతో స్వామి దర్శనానికి వచ్చిన ఆయనను చూసిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సాంప్రదాయ దుస్తులలో కనిపించిన నాగార్జునను చూసి ఓ మహిళ పులకించి పోయింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చటుక్కున నాగార్జున చెయ్యి అందుకుని ముద్దుపెట్టుకున్నారు. నాగార్జున కూడా నవ్వుతూ ఉండిపోయారు. వివరాలిలా ఉన్నాయి. 
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఎంపికైన దర్శకుడు రాఘవేంద్ర రావు బుధవారం తిరుమలకు చేరుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట అన్నమయ్య ఫ్యామిలీ పేరుతో అన్నమయ్య  యూనిట్ కూడా వచ్చింది.

webdunia
ఈ సందర్భంగా నాగార్జున రాఘవేంద్ర రావుతోటే ఉన్నారు. ఆయనతోపాటే ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు అధ్యక్షుడు చదలవాడ క్రిష్ణమూర్తి దగ్గరుండి దర్శనం చేయించారు. ఆలయ అధికారులు రాఘవేంద్రరావుకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈవో సాంబశివరావు టీటీడీ పరిస్థితులను రాఘవేంద్రరావుకు వివరించారు. తిరుమల రాక సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, రాఘవేంద్రరావు సాధారణంగా మాట్లాడడని ఆయన మిత, మృధు భాషి అని అన్నారు. ఆయన మాట్లాడడం  వేంకటేశ్వర స్వామి మహత్యమేనని అన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu