Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎసిడిటి తగ్గించే ఉత్థాన పాదాసనం

ఎసిడిటి తగ్గించే ఉత్థాన పాదాసనం
, గురువారం, 18 అక్టోబరు 2012 (20:16 IST)
FILE
ప్రస్తుతం సంక్లిష్ట జీవన విధానంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఆదుర్దా, ఒత్తిడి అనేవి ప్రతి ఒక్కొరికి తప్పనిసరి అవుతున్నాయి. అందువల్ల ఉద్యోగస్తుల అనారోగ్యానికి గురవుతున్నారు. అనేక ఇతర రంగాలలో వుండేవారు, స్త్రీలు. చదువులలో మునిగిన పిల్లలు కూడా నాడీమండలోద్రేకం, ఎమోషనల్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల అనేక శారీరక సమస్యలతో పాటు అజీర్ణం, గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం వంటి జీర్ణమండల సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యలన్నిటితో పాటు ఆమ్లాధిక్యతను తగ్గించేందుకు యోగాసనాలు చాలా ఉపకరిస్తాయి. ఎసిడిటి తగ్గించేందుకు యోగాసనాలలో ఇది ఒకటి

ఉత్థానపాదాసనం :
1. ఒక చాపపై వెల్లికిలా పరుండాలి.
2. పల్చటి తలగడపై తల ఆన్చాలి.
3. కాళ్లను నిటారుగా నేలబారుగా సాచాలి.
4. మొదట ఒక అడుగు ఎత్తు రెండు కాళ్లు ఎత్తాలి.
5. నడుము నేలకు తగులుతూ వుండాలి.
6. కాళ్లు నిటారుగా వుండాలి.
7. అరిచేతులు నేలకు ఆన్చి వుండాలి.
8. ఈ స్థితిలో 15 సెకన్లపాటు మామూలు శ్వాసక్రియ జరపాలి.
9. నిశ్వాసక్రియ జరుపుతూ కాళ్ళను నెమ్మదిగా నేలకు ఆన్చాలి.
10. యథా స్థితికి రావాలి.
11. అనుభవజ్ఞుల సలహాతో ఈ ప్రక్రియ 12 సార్లు వరకు చెయ్యవచ్చును.

ఉపయోగాలు :
1. జీర్ణాశయం లోని ఆమ్లాధిక్యత తగ్గుతుంది.
2. పొత్తి కడుపుకు సంబంధించిన రోగములు నివారణ అవుతాయి.
3. మలబద్ధకం కూడా నివారించబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu