Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విటమిన్ డి, ఈతో ఒబిసిటీకి చెక్.. తృణధాన్యాలు తీసుకోండి.!

విటమిన్ డి, ఈతో ఒబిసిటీకి చెక్.. తృణధాన్యాలు తీసుకోండి.!
, గురువారం, 19 నవంబరు 2015 (20:07 IST)
ఒబిసిటీతో ఇబ్బందులు పడుతున్నారా? రోజూ ఏసీల కింద కూర్చుని గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా? అయితే లోపం అక్కడే వుందని గమనించండి. బరువు పెరగడానికి విటమిన్ ఈ లోపం కూడా కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు, ఒత్తిడి, శారీరక రుగ్మతలు, ఆహారపు అలవాట్ల వలన ఏర్పడుతుంది. ఇవన్నీ కాకుండా విటమిన్ డీ లోపంతో కూడా బరువు పెరుగుతారని తాజా పరిశోధనలో తేలింది. సూర్య కిరణాలు ఒంటిపై పడకపోవడం ద్వారా బరువు పెరుగుతారని.. సూర్యోదయం, సూర్యాస్తమ కిరణాలైనా శరీరంపై పడేలా పది నిమిషాలు ఎండలో నిలబడాలని వారంటున్నారు. 
 
అలాగే ఒత్తిడిని నియంత్రించేందుకు ''డి'' విటమిన్‌తో పాటు 'ఈ' విటమిన్ ఎంతో ఉపయోగపడుతుందని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. 'ఈ' విటమిన్ తృణధాన్యాలు, ఆలివ్ నూనెల్లో పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ శరీరానికి అందడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని.. ఈ కొరత ఏర్పడితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  
 
స్థూలకాయుల రక్తంలో విటమిన్ 'ఈ' ఉంటుంది కానీ, కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీరాల్లో మాత్రం విటమిన్ 'ఈ' లోపించి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. కొవ్వు అధికంగా ఉన్నవారికి విటమిన్ 'ఈ' అందిస్తే అధిక బరువు సమస్యను నియంత్రించవచ్చునని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu