Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేరుశెనగ నూనెలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

వేరుశెనగ నూనెలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటి?
, గురువారం, 28 మే 2015 (19:07 IST)
వేరుశెనగ నూనెలో ఇతర కూరగాయల్లో వుండే విధంగా ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. వేరుశెనగ నూనెలో ఉండే ధాతువులు ప్రమాదకరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వేరుశెనగ నూనెలో రెస్వెట్రాల్, పోలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలలో ఉన్నాయి. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి పనిచేస్తుంది. 
 
వేరుశెనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. వేరుశెనగ నూనెలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి. వేరుశెనగ నూనె అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెడుతుంది. వేరుశెనగ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. వేరుశెనగ నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని యంగ్‌గా హెల్దీగా ఉంచుతుంది. 
 
వేరుశనగ నూనెలో ఉండే రెస్వెట్రాల్ ఆకట్టుకునే స్థాయిలు రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రత్యేకించి వైరల్ అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆహారంలో వేరుశనగ నూనెను జోడించడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu