Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చపాతీనే ఎందుకు తినాలి..? అంతటి ప్రయోజనాలేంటి?

చపాతీనే ఎందుకు తినాలి..? అంతటి ప్రయోజనాలేంటి?
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (10:03 IST)
చపాతీ పేరు చెబితేనే చాలా మందికి విసుగు. అన్నం తినడంలో ఉన్నంత రుచి మరెక్కడా ఉండదని భావిస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన జనం మరి ఎక్కువగా అన్నం తినడానికే ఇష్టపడతారు. కానీ చపాతీ వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ చపాతీలో అంతటి మేలు ఏముందో అని రాగాలు తీసేవారు కూడా ఉంటారు. రండీ.. అసలు చపాతీలో ఏమి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. 
 
చపాతీలు తినటం వలన శరీరానికి అందించబడే కొవ్వు పదార్థాల స్థాయిలు కూడా తక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. గోధుమలు, విటమిన్ బి,ఈలను కలిగి ఉంటాయి. ఇందులో  కాపర్, అయోడైడ్, జింక్, మాగ్నస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మేగ్నిషియం, కాల్షియం మరియు మినరల్ సాల్ట్ వంటి శరీరానికి కావలసిన పోషకాలను కలిగి ఉంటుంది. 
 
ఇందులోని జింక్ మరియు ఇతర మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గోధుమల ద్వారా చేసిన చపాతీ తినటం వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చపాతీలు సులభంగా జీర్ణం అవుతాయి, రైస్ తో పోల్చుకుంటే గోధుమలతో చేసిన చపాతీలు త్వరగా, సులభంగా జీర్ణం చెందించబడతాయి. గోధుమలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి. వీటి వలన శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. 
 
చపాతీలో ఐరన్ మూలకం ఎక్కువపాళ్ళలో ఉంటుంది. దీంతో హిమగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చపాతీ తినటం వలన శరీరానికి తక్కువ క్యాలోరీలు అందించబడతాయి. బటర్ లేదా ఆయిల్ లేని చపాతీల నుండి చాలా తక్కువ మొత్తంలో క్యాలోరీలు అందిస్తాయి.  


ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే చపాతీల వలన జీర్ణం శక్తి పెరుగుతుంది. మలబద్ధకం దానంతట అదే తగ్గుతుంది. ఫైబర్ మరియు సెలీనియంలను కలిగి ఉండడవలన చపాతీలు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయని పరిశోధనలలో కనుగొనబడింది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఇంతకంటే ఏం కావాలి.  
 

Share this Story:

Follow Webdunia telugu