Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిమ్మకాయను 4 భాగాలుగా కట్‌ చేసి పడక గదిలో ఉంచితే...

సాధారణంగా నిమ్మకాయ… ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉపయోగపడే పండు. సిట్రస్ జాతికి చెందిన ఈ నిమ్మపండులోఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. నిమ్మకాయ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. నిమ్మకాయల తాజా సువాసన ఆరో

నిమ్మకాయను 4 భాగాలుగా కట్‌ చేసి పడక గదిలో ఉంచితే...
, శనివారం, 7 జనవరి 2017 (06:22 IST)
సాధారణంగా నిమ్మకాయ… ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉపయోగపడే పండు. సిట్రస్ జాతికి చెందిన ఈ నిమ్మపండులోఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. నిమ్మకాయ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. నిమ్మకాయల తాజా సువాసన ఆరోగ్యానికి మంచిది. నిమ్మకాయ యాంటిసెప్టిక్, యాంటి బాక్టీరియల్‌గా కూడా పని చేస్తుంది. అలాంట నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి పడక గదిలో ఉంచడం వల్ల ఏం జరుగుతుందో పరిశీలిద్ధాం. 
 
ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని నాలుగు భాగాలుగా కత్తిరించి ఒక పాత్రలో పెట్టి పడక గదిలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల అది సువాసన వెదజల్లుతుంది. మనం ఉపయోగించే రూమ్ ఫ్రెష్‌నర్స్ కంటే నిమ్మకాయలు ఎంతో ఉపయోగమైనది. 
 
నిమ్మ సువాసనతో కూడిన గాలి పీల్చుతుంది. దీనివల్ల శ్వాస తాజాగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచే సమయానికి గొంతుతో పాటు.. మెదడు తాజాగా ఉంటాయి. ఆస్తమా, జలుబుతో బాధపడుతున్నవారు కూడా ఉపశమనం పొందవచ్చు. 
 
ఒక బౌల్‌లో నిమ్మకాయలను ఉంచి ముఖానికి దగ్గరగా పెట్టి ఆ గాలి పీలిస్తే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది కాఫీ, ఎనర్జీ డ్రింకుల కంటే ఎంతో శక్తినిస్తుంది. నిమ్మకాయల తాజా సువాసన ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాసలో ఇబ్బంది లేకుండా చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలాలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు...