Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్జైమర్స్‌ను నివారించాలంటే.. డ్రై ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్ తీసుకోండి

అల్జైమర్స్‌ను నివారించాలంటే.. డ్రై ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్ తీసుకోండి
, గురువారం, 26 నవంబరు 2015 (18:05 IST)
అల్జైమర్స్‌ను నివారించాలంటే.. ముందుగా రెగ్యులర్ డైట్‌లో ప్రోటీనులు ఉండేలా చూసుకోవాలి. ఈ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, వేగవంతంగా వచ్చే డెత్ ఆఫ్ సెల్స్‌ను నిరోధిస్తుంది. అందుకే మతిమరుపును దూరం చేసుకోవాలంటే తీసుకునే ఆహారంలో మెలకువ వుండాలంటున్నారు.. న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌ను తీసుకోవాలి. ఇవి మెమరీ పవర్‌ను పెంచడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి, ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు సహాయపడుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి.
 
బాదం, వాల్‌నట్స్, హాజల్ నట్స్ ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరం మరియు బ్రెయిన్ హెల్త్‌కు అవసరం అయ్యే ఫ్యాట్‌ను కలిగి ఉంటాయి వాల్ నట్స్, బాదం ఎక్కువగా తీసుకొనే వారిలో మెమరీ సామర్థ్యం సమర్థవంతంగా ఉన్నట్టు గుర్తించారు.
 
క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్‌లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu