Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిద్రలేమికి కారణాలేంటి....? అధిగమించడమెలా....?

నిద్రలేమికి కారణాలేంటి....? అధిగమించడమెలా....?
, మంగళవారం, 23 జులై 2013 (15:27 IST)
FILE
కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్ర పట్టిన తర్వాత గాఢనిద్రలోకి చేరుకోలేకపోవడం కొంతమందికి తొందరగానే నిద్రపడుతుంది. కాని అర్థరాత్రి మెలకువ వస్తుంది. చాలా మంది నిద్రపోయిన తర్వాత నిద్రలేచే సమయానికంటే చాలా ముందరే మెలుకుంటారు.

ఆ తర్వాత తిరిగి ఎంత ప్రయత్నించినా వీరికి నిద్రరాదు. మగవారిలో కన్నా ఆడవారిలో నిద్రలేమి ఎక్కువుగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ వ్యాధి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం వలన నిద్రలేమి వ్యాధి వస్తుంది.

వాత, కఫ, పిత్త వ్యాధుల వలన వచ్చే నిద్రలేమికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

* రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి.
* పడుకునే ముందు పాలు త్రాగాలి.
* వేడి ఆహారం తినటం మంచిది.
* ఒత్తిడితో కూడిన పని చేయరాదు.
* మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.
* ఉపవాసం చేయరాదు.
* వ్యాయామం చేయటం మంచిది
* గోరు వెచ్చని నీరు త్రాగాలి.
* తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.

Share this Story:

Follow Webdunia telugu