Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆమె మొదలుపెడితేగానీ నాకు మూడ్ రావడం లేదు.. ఏం చేయాలి?

ఆమె మొదలుపెడితేగానీ నాకు మూడ్ రావడం లేదు.. ఏం చేయాలి?
, శుక్రవారం, 24 జులై 2015 (12:54 IST)
నా వయస్సు 40 యేళ్లు. నా భార్యకు 38 యేళ్లు. ఇద్దరికీ శృంగార కోర్కెలు అధికమే. అయతే, నాకు ఇప్పటికీ పరాయి స్త్రీలను ఊహించుకుంటూ హస్త ప్రయోగం చేసుకుని తృప్తిపడుతున్నా. పైపెచ్చు నా భార్యతో దాంపత్య జీవితాన్ని సైతం బాగానే ఎంజాయ్ చేస్తున్నా. అయితే, నా సమస్య ఏంటంటే... నా భార్యతో సెక్స్‌లో పాల్గొనాలంటే ఆమె మొదలుపెడితేగానీ నాకు మూడ్ రావడంలేదు. కానీ ఆమెవైపు నుంచి స్పందన నామమాత్రంగానే ఉంది. దీంతో పరాయి స్త్రీలను ఊహించుకుంటూ, వారితో సెక్స్ చేస్తున్నట్టుగా భావిస్తూ ఎంజాయ్ చేస్తున్నా. ఏం చేయాలి?
 
సాధారణంగా దంపతుల్లో శృంగార కోర్కెలు లేదా సమస్యలన్నీ ఒకేలా ఉండవు. అలాగే, సెక్స్‌లో పాల్గొనేతీరు, శృంగారంలో స్పందించే రీతుల్లో కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి సమస్యలకు కారణం మనషుల మనస్సులు కలవక పోవడమే. భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మనస్సులు ఒక్కటైనపుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నంకావు. 
 
శృంగారంలో తొలుత ఎవరైనా స్పందించవచ్చు. కేవలం భార్యా లేదా భర్తే స్పందించాలన్న నిబంధన లేదు. అయితే, పురుషునిగా భర్తే చొరవ తీసుకోవడంలో తప్పులేదు. చాలామంది ఆడవారు చొరవ చూపేందుకు సహజంగానే ఆసక్తిచూపరు. అందువల్ల ఆమె మనస్సులో ఏముందో తెలుసుకుని తదనుగుణంగా నడుచుకోవడం మంచిది. రోజుకో రీతిలో సెక్స్ చేయించుకుంటూ దాంపత్య జీవితాన్ని అనుభవించాలన్న భావన ఆమెలో కల్పించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారమార్గం లభించినట్టే. 

Share this Story:

Follow Webdunia telugu