Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగిన గుండెను బతికించవచ్చా...! ఎలా..? ఎక్కడ?

ఆగిన గుండెను బతికించవచ్చా...! ఎలా..? ఎక్కడ?
, శనివారం, 26 సెప్టెంబరు 2015 (10:23 IST)
ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతే.. దానిని తిరిగి బతికించ గలిగితే.. ఈ ప్రపంచంలో ఇక చావనే దానికి తావే ఉండదు. ఎక్కడైనా ఇలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయా.. అంటే అవుననే అంటున్నారు కొందరు పరిశోధకులు ఆగిపోయిన గుండె కండరాలను మళ్ళీ కదిలించి పని చేయించవచ్చుని అంటున్నారు. ఇది ఎక్కడ? ఎవరా పరిశోధకులు? ఏమిటా సాంకేతికత..? వివరాలిలా ఉన్నాయి. 
 
అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలోని యూనివర్శిటీలోని పరిశోధక బృందం ఒకటి ఆగిన గుండెను తిరిగి పనిచేయించడంపై తల మునకలై ఉంటున్నారు. ఇందుకోసం ఫ్రాంకెన్‌స్ట‌యిన్ అనే సాంకేతికతను తయారు చేస్తున్నారు. ఈ బృందానికి భారతీయ సంతితికి చెందిన అమిత్ పటేల్ సారధ్యం వహిస్తున్నారు. గుండె కండరాలలో కదలిక తీసుకురావడం ద్వారా గుండెను పని చేయించవచ్చనని చెబుతున్నారు. 
 
వారు అనురిస్తున్న ఫ్రాంకెన్‌స్ట‌యిన్ సాంకేతికలోని ఎక్స్‌ట్రా సెల్యులార్ మాట్రిక్స్ అనే పొడిని పంపడం ద్వారా గుండె కండరాలను పని చేయించవచ్చునని వాదిస్తున్నారు. ఈ పొడి కండరాలలోని ప్రొటీన్లను, కండరాలను వేరు చేస్తుందని అంటున్నారు. తాము చేసే విధానాన్ని ఎండో కాడ్రియల్ మాట్రిక్స్ థెరఫీ అంటారని, అది చాలా చౌక అని పటేల్ భావిస్తున్నారు. ఇది చాలా సులభమైనది వారు అంటున్నారు. 
 
ఈ విధానాన్ని ఓ మహిళపై ప్రయోగించారు. ఈ విధానం వలన గుండె రక్తాన్ని సరఫరా చేసే విధానాన్ని ప్రభావితం చేశాయి. రక్త ప్రసరణ అనేది 60 శాతం నుంచి 45 శాతానికి పడేసింది. దీని వలన గుండెలో మృత కండరాలను తిరిగి జీవం పోయవచ్చునని తేల్చారు. ఇది ఇంక పరిశోధన దశలోను ఉందని మరింత పటేల్ అంటున్నారు. దాదాపుగా 18 మందిపై ప్రయోగం జరుగుతోందని అన్నారు. అన్ని సవ్యంగా జరిగితే ఇక ఆగిన గుండెను బతికించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu