Publish Date: Sat, 04 Apr 2026 (16:11 IST)
Updated Date: Sat, 04 Apr 2026 (16:14 IST)
హైదరాబాద్‌లోని మెడికవర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్‌పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
అంతర్జాతీయ నిపుణులు ఇటీవల జరిగిన ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు వంటి యుద్ధ పరిస్థితుల్లో అత్యవసర వైద్య సేవల నిర్వహణపై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇరాన్ వైద్యులు యుద్ధ సమయంలో ఎలా స్పందిస్తున్నారో వివరించారు. భారీ ఒత్తిడి పరిస్థితుల్లో కూడా, వారు ఫీల్డ్ హాస్పిటల్స్, మొబైల్ ఎమర్జెన్సీ యూనిట్స్, వేగవంతమైన ట్రయాజ్ విధానాల ద్వారా గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అలాగే పరిమిత వనరులతో పనిచేస్తూ, సమన్వయంతో, శిక్షణతో అత్యవసర సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
గవర్నర్ తన ప్రసంగంలో సమగ్ర అత్యవసర వైద్య వ్యవస్థ అవసరాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు వేగవంతమైన మరియు నాణ్యమైన వైద్య సేవలను అందించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవల ప్రమాణాలపై రూపొందించిన ప్రత్యేక గ్రంథాన్ని విడుదల చేయగా, ట్రామా కేర్ అభివృద్ధికి సంబంధించిన ఒక కీలక ప్రకటనను కూడా ఆమోదించారు.
మెడికవర్ ప్రతినిధులు ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ నయన్ శ్రీరాముల మాట్లాడుతూ, ట్రామా కేర్‌లో సాంకేతికతతో పాటు సమయపాలన, సమన్వయం మరియు శాస్త్రీయ విధానాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ, సమన్వయంతో పనిచేసే వైద్య బృందం ద్వారానే ప్రాణాలను సమర్థవంతంగా రక్షించగలమని వివరించారు.
సదస్సులో పాల్గొన్న వైద్య నిపుణులు:
ఈ సదస్సు నిర్వహణలో మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ & మేనేజింగ్ డైరెక్టర్ జి. అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. శరత్ రెడ్డి మార్గనిర్దేశకులుగా వ్యవహరించారు. ఆర్గనైజింగ్ ఛైర్మన్‌గా డాక్టర్ నయన్ శ్రీరాముల, సెక్రటరీగా డాక్టర్ కె. దామోదర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్గనైజింగ్ కమిటీలో డాక్టర్ నరసింహ రెడ్డి, డాక్టర్ సాహుల్ దమేరా, డాక్టర్ అంకిత అకెళ్ల, డాక్టర్ విజయ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. సైంటిఫిక్ కమిటీలో డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ వర్ష జోషి, డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఘనశ్యామ్ జగత్కర్, డాక్టర్ కమల్ కిరణ్, డాక్టర్ జగదీష్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ దివాకర్ రెడ్డి మరియు డాక్టర్ అమర్ రఘు తమ సేవలను అందించారు.
అంతర్జాతీయ నిపుణులుగా డాక్టర్ మేజర్ ఫ్రాంక్ వాన్ ట్రింపాంట్, డాక్టర్ హుసామ్ అల్తోబైన్, డాక్టర్ ఒమర్ గజన్ఫర్, డాక్టర్ అహ్మద్ నామ, ప్రొఫెసర్ డాక్టర్ జార్జ్ బ్రైట్బర్గ్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ డోనాల్డ్ డోనాహ్యూ సదస్సులో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సు ద్వారా దేశంలో ట్రామా కేర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలు వెలుగులోకి వస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. శరత్ రెడ్డి, శ్రీ హరికృష్ణ గారు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.