Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో 24x7 స్ట్రోక్ యూనిట్!

ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో 24x7 స్ట్రోక్ యూనిట్!
, సోమవారం, 18 మే 2015 (18:19 IST)
చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో కొత్తగా వారంలోని ఏడు రోజులూ 24 గంటల పాటు పని చేసే స్ట్రోక్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు చెందిన న్యూరాలజీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ కరుణా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రోక్‌కు గురైన రోగులకు అత్యంత వేగవంతంగా చికిత్స అందించేందుకు, వారు త్వరగా కోలుకునేందుకు ఈ విభాగం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఇందులో వారంలోని ఏడు రోజులు, 24 గంటల పాటు అత్యుతున్న ప్రమాణాలతో కూడిన చికిత్సను అందిస్తారని చెప్పారు. ఈ యూనిట్‌కు అమెరికా స్ట్రోక్ యూనిట్ గుర్తింపు కూడా లభించినట్టు ఆయన వివరించారు.
 
 
ఈ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ స్పందిస్తూ మెడ్‌ఇండియా నివేదిక ప్రకారం ఇపుడు సంభవించే మరణాలకు కేన్సర్, ఇతర హృద్రోగ రోగాల తర్వాతే స్ట్రోక్ ప్రధాన కారణంగా ఉందన్నారు. స్ట్రోక్ లక్షణాలను గుర్తించి రోగులకు తక్షణం మెరుగైన వైద్య సేవలు అందించడం వల్ల వారిని ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చన్నారు. అయితే, ఈ వైద్య సేవలు స్ట్రోక్‌కు గురైన 4.30 గంటలలోపు అందించాల్సి ఉంటుందన్నారు. 
 
భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇతర అగ్రదేశాల్లో మరణించే వారి కంటే పదేళ్ళు ముందుగానే మృత్యువాతపడుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, హైపర్ టెన్షన్‌ కూడా మృతికి 30 -50 శాతం కారణంగా ఉందన్నారు. స్ట్రోక్‌కు గురైన ప్రతి ఐదుగురిలో ఒకరు నెల తిరగక ముందే చనిపోతున్నారన్నారు. ఒకవేళ ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు శారీరక వైఫల్యానికి గురవుతున్నట్టు వివరించారు. 
 
కాగా, ఈ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి ప్రముఖ న్యూరాజలిస్టు, ఎపిలెప్టోలాజిస్ట్ అధిపతి డాక్టర్ దినేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.కాగా, ఈ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి ప్రముఖ న్యూరాజలిస్టు, ఎపిలెప్టోలాజిస్ట్ అధిపతి డాక్టర్ దినేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu