Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు పెరగాలంటే భార్యతో నిత్యం గొడవ పడాల్సిందే!

బరువు పెరగాలంటే భార్యతో నిత్యం గొడవ పడాల్సిందే!
, గురువారం, 23 అక్టోబరు 2014 (12:20 IST)
మీరు బరువు తక్కువగా ఉన్నారా? వెంటనే బరువు పెరగాలని భావిస్తున్నారా? అయితే మీరు అమెరికా శాస్త్రవేత్తల చిట్కాను వెంటనే ఫాలో అయిపోండి. తక్షణం బరువు పెరగాలంటే ప్రతి రోజూ తగవులు, వాదనలు పెట్టుకునే ఆలుమగలు తొందరగా ఊబకాయులవుతారని అమెరికన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. 
 
భార్య లేదా భర్తతో గొడవ పెట్టుకున్న తర్వాత ఆహారం తీసుకున్నప్పుడు వ్యక్తులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలా ఒత్తిడిలో ఆహారం తీసుకున్నప్పుడు, శరీరంలో కేలరీస్ బాగా తక్కువగా ఖర్చవుతాయని... రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ బాగా పెరిగి మెజార్జీ ఆహార పదార్థాలు కొవ్వుగా మారతాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇలా, ఒత్తిడితో ఆహారం తీసుకోవడం రెగ్యులర్‌గా జరుగుతుంటే ఊబకాయులవడం చాలా తేలికని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu