Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిట్లర్ "పులిరాజా"కు ఎయిడ్స్ వస్తుందా...?

హిట్లర్
FILE
అపరిచిత వ్యక్తులతో సెక్స్ అపాయం... ఫలితం ఎయిడ్స్. ఈ ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. "పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా..?" అనే ప్రశ్నను సంధిస్తూ... ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు.

ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో జర్మనీ దేశంలో "హిట్లర్ రాజాకు ఎయిడ్స్ వస్తుందా..." అంటూ జర్మనీ ప్రభుత్వం ప్రకటనలను ఇచ్చింది. ఈ ప్రకటనలో జర్మన్ నియంత హిట్లర్ మాదిరి హావభావాలతో ఓ పురుషుడు చింతపిక్కి మీసకట్టుతో ఓ స్త్రీతో హద్దులు మీరి శృంగారం నెరపుతుంటాడు. అయితే అతను ఎయిడ్స్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇదీ ప్రకటన తాలూకు కాన్సెప్ట్.

అయితే ఈ ప్రకటనపై జర్మనీలోని యూదులు ధ్వజమెత్తుతున్నారు. హిట్లర్ హావభావాలతో ఓ పురుషుడు మితిమీరిన శృంగారం నెరపుతుండడాన్ని ప్రస్తావిస్తూ... హిట్లర్ మితిమీరిన శృంగారం చేసేవాడన్నట్లు చిత్రీకరించడంపై మండిపడుతున్నారు. జర్మన్ ప్రభుత్వం మాత్రం "హిట్లర్ రాజాకు ఎయిడ్స్ వస్తుందా...?" అని ప్రశ్నిస్తూనే ఉంది.

Share this Story:

Follow Webdunia telugu