Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో పెరుగుతున్న గుండె - బీపీ రోగుల సంఖ్య

దేశంలో పెరుగుతున్న గుండె - బీపీ రోగుల సంఖ్య
దేశంలో పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వారిలో శారీరక శ్రమను దూరం చేస్తున్నాయి. పైపెచ్చు.. ఈ పోటీ ప్రపంచంలో యువతీయువకులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.

దీంతో దేశంలో బీపీ, హృద్రోగ సమస్యల బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. బ్రిటిష్ జర్నల్ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం 1980 నుంచి 2000 వరకు దేశంలో 13.19 కోట్ల మందికి బీపీతో బాధపడుతున్నట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మన దేశంలో 14 శాతం మంది బీపీ రోగులు ఉండగా, దేశంలో 70 శాతం మందికి అధిక రక్తపు పోటు ఉన్నట్టు తెలిపింది.

అలాగే, ప్రపంచ స్థాయిలో మహిళల్లో రక్తపుపోటు ప్రమాణాలు 2.7 మిల్లీగ్రాముల తగ్గితే మన దేశపు మహిళల్లో మాత్రం 2.4 మిల్లీగ్రామ్స్ పెరిగినట్టు పేర్కొంది. అలాగే, పురుషుల్లో ఇది 2.3 (ప్రపంచ వ్యాప్తంగా), భారత్‌లో 2.2 మిల్లీగ్రామ్స్‌గా ఉన్నట్టు ఆ జర్నల్స్ వెల్లడించింది. ఈ బీపీ లెవెల్స్ పెరగడానికి మారుతున్న ఆహారపు అలవాట్లు, ఉప్పు, కారాన్ని ఎక్కువగా తీసుకోవడం, యువతలో పని ఒత్తిడి వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu