Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెట్టినాద్ ఆస్పత్రిలో ప్రపంచ తొలి రొబొటిక్ సర్జరీ సక్సెస్

చెట్టినాద్ ఆస్పత్రిలో ప్రపంచ తొలి రొబొటిక్ సర్జరీ సక్సెస్
WD
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెట్టినాద్ ఆస్పత్రిలో ప్రపంచ తొలి రొబోటిక్ అసిస్టెట్ డబుల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. స్థానిక కేలంబాక్కం, ఐటీ క్యారిడార్‌లో వెలసిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్కులరో డిసీజ్ విభాగం డైరక్టర్ డాక్టర్ ఆర్.రవికుమార్, ఆయన బృందం 23 సంవత్సరాల యువకునికి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.

ఈ ఆపరేషన్‌పై డాక్టర్ రవికుమార్ గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ 2000 సతంవత్సరంలో అమెరికా రొబోటిక్ సర్జరీని తొలిసారి ప్రవేశపెట్టారన్నారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే శస్త్రచికిత్సా విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ విధానం అత్యంత నాణ్యవంతంగా, సులభతరంగా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడం జరిగిందన్నారు.

అమెరికాకు చెందిన డాక్టర్ చిట్‌వుడ్ తొలిసారి ఈ తరహా విధానం ద్వారా తొలి ఆపరేషన్‌ను చేశారు. ఆ తర్వాత భారత్‌లో 2006లో హృదయ కవాటాల మార్పిడి ఆపరేషన్‌ పూర్తి చేసినట్టు తెలిపారు. తర్వాత 2007 సంవత్సరంలో చెట్టినాద్ అయోటిక్ కవాటాల మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు. అయితే, రొబొటిక్ సర్జరీ విధానం ద్వారా రెండు కవాటాల మార్పిడి చికిత్సను మాత్రం ఇప్పటి వరకు ఎవరూ.. ఎక్కడా చేయలేదన్నారు.

ఈ విధానంలో టెక్నికల్‌గా కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలూరు జిల్లాకు చెందిన 23 సంవత్సరాల విజయకాంత్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా హృద్రోగంతో బాధపడుతూ వచ్చాడు. ఈ రోగిని గుర్తించిన రవి కుమార్.. ఫిబ్రవరి నెల 21వ తేదీన రొబోటిక్ విధానం ద్వారా హృదయం సంచికి ఇరువైపుల ఉన్న రెండు కవాటాల మార్పిడి చికిత్సను పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌కు ముందు విజయకాంత్ కనీసం 15 అడుగుల దూరం కూడా నడవలేని పరిస్థితి ఉండేది. కానీ, ఆపరేషన్ తర్వాత ఆ యువకుడు మూడు అంతస్తుల మెట్లను ఎక్కడమే కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నట్టు తెలిపారు.

ఈ తరహా ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కంటే విభిన్నంగా ఉంటుందన్నారు. తక్కువ మొత్తంలో టిష్యూ దెబ్బతినడం, తక్కువ మొత్తంలో తక్కువ పోవడం, నొప్పి ఎక్కువగా లేకపోవడం వంటి అంశాలతో పాటు.. ఆస్పత్రిలో తక్కువ కాలం ఉండటమే కాకుండా, త్వరితగతిన తమ విధులకు హాజరుకావొచ్చని, ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నదని డాక్టర్ రవికుమార్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో వైద్యుల బృందం చొక్కలింగం, శ్రీనివాసన్, ఐశ్వర్యా విద్యాసాగర్, గోకుల కృష్ణన్‌లు పాల్గొన్నట్టు ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu