Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విషజ్వరాలతో తస్మాత్ జాగ్రత్త!

విషజ్వరాలతో తస్మాత్ జాగ్రత్త!
, శుక్రవారం, 27 నవంబరు 2015 (17:01 IST)
సాధారణంగా నాలుగు చినుకులు జల్లుగా కురుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి విపరీతమైన ఎండ కాస్తుంది. లేదా విపరీతమైన ఉక్కపోతగా ఉంటుంది. లేదంటే వెంటనే మేఘాలు కమ్ముకొని వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులు వీస్తాయి. ఇలా వాతావరణంలో అనుకోకుండా వచ్చే మార్పులు ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. 
 
శరీరం బయటి వాతావరణానికి అలవాటు పడటానికి కొంతసమయం పడుతుంది. ఈ సర్దుబాటుల్లో శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ కాస్త బలహీన పడే అవకాశం లేకపోలేదు. ఇలా బలహీనపడినపుడు ఇన్‌ఫెక్షన్లు శరీరంలో చేరేందుకు వీలు దొరుకుతుంది. అది ఫ్లూ రూపంలోనా... లేక విషజ్వరంగా మారుతుందా.. అనేది నిరోధక వ్యవస్థ పోరాట పటిమపై ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా విషజ్వరాలు వ్యాపిస్తుంటాయి. వీటిబారిన పడుకుండా ఉండాలంటే కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 
 
ప్రస్తుత కాలంలో వర్షాలు కురిసినా.. కురవకపోయినా విష జ్వరాలు మాత్రం తప్పటం లేదు. ఇందుకు వర్షం మన రాష్ట్రంలోనే పడాల్సిన పనిలేదు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో వర్షాలు పడినా విషజ్వరాలు వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. కొద్దిపాటి అవగాహన, ముందు జాగ్రత్త ఉంటే వీటిని ప్రబలకుండా చూసుకోవచ్చు. విషజ్వరాలు కొన్ని వైరస్‌ల వల్ల, కొన్ని బాక్టీరియాల వల్ల వస్తాయి. వీటిలో ముఖ్యమైనవి డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్ ముఖ్యమైనవి. వీటి బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత శ్రద్ధతో పాటు... ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు. 

Share this Story:

Follow Webdunia telugu