Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏంటి..? పొగతాగితే ఇన్ని అనర్థాలా..? వెన్నెముక దెబ్బతింటుందా..! ఇంకా..

ఏంటి..? పొగతాగితే ఇన్ని అనర్థాలా..? వెన్నెముక దెబ్బతింటుందా..! ఇంకా..
, మంగళవారం, 4 ఆగస్టు 2015 (12:41 IST)
‘పొగ తాగుట నేరం’ అనే ప్రభుత్వ ప్రచారాన్ని చూసి వెక్కిరించే వారు చాలా మందే ఉంటారు. రకరకాల వ్యాఖ్యానాలు చేసే వారూ ఉంటారు. అయితే పొగతాగితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, గుండె జబ్బులు పెరుగుతాయని మాత్రమే విన్నాం. కానే కాదు. ఇంకిన్ని జబ్బులు క్యూలో ఉంటాయట. ఎంత ఎక్కువ పొగ తాగితే అంత ఎక్కువగా శరీరంలోకి దూరిపోతాయట. ఎముకలు కూడా దెబ్బతింటాయి. ఎముకలకే అత్యధిక నష్టం కలుగుతుందట. 
 
మన శరీరమే ఎముకల నిర్మాణం. పొగ మూలంగా ఎముక సాంద్రత తగ్గుతుంది. దీంతో ఇతరత్రా ఎముకలతో పాటు శరీరాన్ని నిటారుగా నిలిపే వెన్నెముక సైతం బలహీనమవుతుంది. ఇది అంతటితోనే ఆగిపోదు. వెన్ను ఇన్‌ఫెక్షన్‌ వంటి రకరకాల సమస్యలనూ తెచ్చిపెడుతుంది. చూడ్డానికి సిగరెట్‌ వేలడంతే ఉంటుంది కానీ.. దీనిలోని పొగాకులో 4వేల రకాల రసాయనాలు ఉంటాయి. 
 
వీటిల్లో కొన్ని రసాయనాలు కాల్చిన తర్వాతే హానికరంగా పరిణమిస్తాయి. నిజానికి వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులకు రక్త సరఫరా తక్కువగా జరుగుతుంది. సిగరెట్లు, బీడీల వంటివి తాగితే ఇది మరింత పడిపోతుంది. దీంతో డిస్క్‌ల ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడే పోషకాలు అందకుండా పోతాయి. ఇక పొగాకులోని నికొటిన్‌.. మృదు కణజాలం ఏర్పడటానికి దోహదం చేసే కొలాజెన్‌ స్థాయులను తగ్గిస్తుంది. 
 
ఫలితంగా మృదులాస్థిలో సాగే గుణం క్షీణించి, బిగువుగా తయారవుతుంది. మృదులాస్థి, వెన్నుపూసలు, డిస్కులు బలహీనమైతే డిస్కు ముందుకు పొడుచుకొచ్చే ముప్పూ పెరుగుతుంది. ఇది వెన్నుపాములోని నాడులు నొక్కుకుపోయేలా చేస్తుంది. అందువల్ల పొగ అలవాటును వెంటనే మానెయ్యటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకేం మీరే ఆలోచించుకోండి...! పొగ తాగడమా.. మానడమా..!! 

Share this Story:

Follow Webdunia telugu