Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామవాంఛ పెరగాలంటే.. మహిళలు నిద్రపోవాలి.. పురుషులు రొమాంటిక్ సీన్లు చూడాలి!

కామవాంఛ పెరగాలంటే.. మహిళలు నిద్రపోవాలి.. పురుషులు రొమాంటిక్ సీన్లు చూడాలి!
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (14:46 IST)
చాలా మంది మహిళలు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటుంటారు. కేవలం ఉద్యోగినులు మాత్రమేకాకుండా గృహిణులు కూడా ఇదే విధమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారిలో కామవాంఛలు చాలా తక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం నిద్రలేమి అని పరిశోధకులు తేల్చారు. 
 
నిజానికి అన్ని విషయాల్లోలాగానే శృంగారం విషయంలోనూ స్త్రీ, పురుషులకు వేర్వేరు అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా.. భావప్రాప్తి విషయంలో కూడా ఇరువురికీ సంబంధం ఉండదు. అలాగే, శృంగారానికి సిద్ధమయ్యే విషయంలోనూ ఎవరి దారి వారిదే. 
 
అయితే, పురుషుని కంటే కూడా స్త్రీలలో కామవాంఛలు అంత సులభంగా కలగవని చెపుతున్నారు. సాధారణంగా పురుషుడు.. రొమాంటిక్ సన్నివేశాలను నెవరువేసుకుంటే కామవాంఛ పుట్టుకొస్తుంది. కానీ, స్త్రీలు ఇందుకు భిన్నంగా ఉంటారట. 
 
మహిళల్లో కామ వాంఛలు పెరగాలంటే వారు తగినంతగా నిద్రపోవాలట. బాగా అలసిపోయిన స్త్రీలతో పోల్చుకుంటే ఎక్కువగా నిద్రపోయిన మహిళల్లో కామ నాడులు బాగా ఉత్తేజం చెందుతాయని, అందువల్ల వీరిలో కోర్కెలు ఎక్కువగా ఉంటాయని యూనివర్సిటీ ఆప్‌ మిచిగాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ పరిశోధకులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu