Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే సీజనల్ ఫ్రూట్స్ ఏమిటి?

శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే సీజనల్ ఫ్రూట్స్ ఏమిటి?
, మంగళవారం, 24 నవంబరు 2015 (15:44 IST)
సాధారణంగా వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే అనేక అనారోగ్య సమస్యలు వెన్నంటి ఉంటాయి. అందుకే ఈ రెండు కాలాల్లో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తతో ఉండాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఫ్రూట్స్‌ను తప్పనిసరిగా ఆరగించాల్సి ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల డయేరియాలాంటి ఎన్నో శరీర బాధలను తగ్గించి, జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చేస్తాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఈ కాలంలో సీజనల్‌గా లభించే ఫ్రూట్స్‌ తినడం ఆరోగ్యానికి ఎంతోమేలు. ఈ సీజన్‌లో లభించే లిచి, ప్లమ్‌, చెర్రీ, పీచ్‌, జమున్‌లాంటి ఫ్రూట్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. లిచి పండు తింటే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను తప్పించుకోవచ్చు. పైగా అవి మనలో రోగనిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. అంతేకాదు వీటి వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. 
 
ఫ్లూ కారకాలైన ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ప్లమ్‌ ఫ్రూట్‌ బాగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్స్‌లో పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. జమున్‌ ఫ్రూట్స్‌లో కాలరీలు తక్కువగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారికి ఈ పండు చాలా మంచిది. డయేరియా, ఆర్థరైటిస్‌ లాంటి జబ్బులతో బాధపడేవారు వీటిని తింటే ఎంతో మంచిది. పీచ్‌ పండు తేమ వాతావరణంలో చర్మం దెబ్బతినకుండా కాపాడడమే కాదు మనలో రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu