Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పుడు అకస్మాత్తుగా సూర్యుడు అదృశ్యమైపోతే... ఏం జరుగుతుందో తెలుసా...?

యోగాలో, హఠ యోగా ఒక సన్నాహక ప్రక్రియ. ‘హ’ అంటే సూర్యుడు, ‘ఠ’ అంటే చంద్రుడు అని అర్ధం. మీలోని సూర్యచంద్రుల మధ్య, లేదా ఈడా, పింగాళ అనే నాడుల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే యోగానే ‘హఠ యోగా’. ‘హఠ’ అంటే మీ శరీరానికి కారణభూతమైన ఈ రెండు ముఖ్య అంశాల మధ్య ఒక విధమ

ఇప్పుడు అకస్మాత్తుగా సూర్యుడు అదృశ్యమైపోతే... ఏం జరుగుతుందో తెలుసా...?
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (18:25 IST)
యోగాలో, హఠ యోగా ఒక సన్నాహక ప్రక్రియ. ‘హ’ అంటే సూర్యుడు, ‘ఠ’ అంటే చంద్రుడు అని అర్ధం. మీలోని సూర్యచంద్రుల మధ్య, లేదా ఈడా, పింగాళ అనే నాడుల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే యోగానే ‘హఠ యోగా’. ‘హఠ’ అంటే మీ శరీరానికి కారణభూతమైన ఈ రెండు ముఖ్య అంశాల మధ్య ఒక విధమైన సమన్వయం తీసుకురావటం.
 
ఈ భూమిపై ఉన్న జీవాన్ని ప్రభావితం చేయటంలో ఈ విశ్వంలోని అన్నిటి కంటే కూడా సూర్యుడు చాలా ప్రధానమైనవాడు. సూర్యుడు మన గ్రహం మీద ఉన్న జీవానికి మూలం. మనం తినే తిండి, త్రాగే నీరు, పీల్చుకునే గాలి, ఇలా ప్రతీ దాంట్లో సూర్యుడి పాత్ర ఉంటుంది. సూర్య కిరణాలు ఈ గ్రహం మీద పడకపోతే, జీవ మనుగడకు అవకాశమే లేదు. అంతా ముగిసిపోతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా సూర్యుడు అదృశ్యమైపోతే, 18 గంటల్లో అన్నీ గడ్డకట్టుకుపోతాయి. సముద్రాలన్నిటితో పాటు మీ రక్తం కూడా. అసలు ఈ గ్రహం మీద ఉత్పత్తి అయ్యే వేడి అంతా కూడా వివిధ మార్గాల్లో వ్యక్తమయ్యే సౌరశక్తే.
 
చంద్రుడి వివిధ స్థానాలు కూడా మనిషి యొక్క శారీరక, మానసిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. భారతదేశంలో చంద్రుడి స్థానం ప్రతీరోజు పరిగణనలోకి తీసుకోబడుతుంది. చంద్రుని వివిధ స్థానాలు మానవ శ్రేయస్సుకు ఉపయోగపడుతాయి. మీ ఎరుక (awareness), గ్రహణశక్తి (perception)లు ఒక స్థాయిలో ఉంటే, చంద్రుని ప్రతీ దశలో మీ శరీరం కొంత భిన్నంగా ప్రవర్తించటం మీరు గమనిస్తారు. మహిళల్లోని పునరుత్పత్తి ప్రక్రియ, అంటే మానవ జనన ప్రక్రియ చంద్ర భ్రమణంతో చాలా లోతుగా అనుసంధానమై ఉంది. ఇలా భూమి చుట్టూ జరిగే చంద్ర భ్రమణం, మనిషిలో సంభవించే పునారవృత స్థితులు, ఈ రెండూ చాలా లోతుగా అనుసంధానమై ఉంటాయి.
 
మీ జీవితంలోని ప్రతీ క్షణం, మీరు చేసే ప్రతీ విషయం సూర్యచంద్రులనే ఈ రెండు శక్తులచే నియంత్రింపబడుతుంది. అందుకే, భౌతికంగా మనం చేసే ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఈ ప్రకృతి చక్రాలతో, అంటే సూర్యచంద్ర భ్రమణాలతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవడానికే.
 
- సద్గురు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జలుబు.. గొంతు నొప్పి తగ్గాలంటే...