Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మేకప్ ఎక్కువ సమయం ఉండాలంటే ఏం చేయాలి?

మేకప్ ఎక్కువ సమయం ఉండాలంటే ఏం చేయాలి?
, గురువారం, 4 ఫిబ్రవరి 2016 (10:20 IST)
ఆఫీసుకెళ్లేటప్పుడు తయారవడానికి ఉద్యోగినులకి ఎక్కువ సమయం ఉండదు. అదీకాక కాలుష్యం వల్ల మొటిమలు, మచ్చలు. వీటి నుంచి బయటపడేందుకు ఏం చేయాలంటే... 
 
ముఖంపై సన్నటి వెంట్రుకలు కనబడుతుంటే చెంపలకు ఫౌండేషన్‌ పౌడర్‌ని కాస్త ఎక్కువగా రాసుకోవాలి. నిమ్మరసాన్ని చెంపలపై రాసుకొని బాగా రుద్దాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే వెంట్రుకలు పలుచబడతాయి. 
 
మొటిమలతో ఇబ్బంది పడేవాళ్లు ఫౌండేషన్‌ వేసుకోకపోవడమే మంచిది. దానికి బదులుగా ముఖానికి ఏదైనా ఫ్రూట్‌ ప్యాక్‌ వేసుకోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే మొటిమలు తగ్గిపోతాయి కూడా. 
 
ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల నెయిల్‌ పాలిష్‌ త్వరగాపోతుంది. నెయిల్‌ పాలిష్‌ వేసుకున్నాక పాలమీగడతో గోళ్లను మర్దనా చేస్తే పాలిష్‌ చాలా రోజులు ఉంటుంది. మోచేతులు పొడిబారిపోయి ఉంటే మూడురోజుకొకసారి ఆలివ్‌ ఆయిల్‌తో మర్దనా చేస్తే మృదువుగా మారతాయి. 
 
హెయిర్‌ కలర్‌ త్వరగా పోతుంటే బ్లాక్‌ టీతో తలంటుకోవాలి. ఇలా చేస్తే జుట్టుకి రంగు తిరిగొస్తుంది. లిప్‌స్టిక్‌ వేసుకున్నాక టిష్యూతో పెదవులపై ట్రాన్స్‌లూసెంట్‌ పౌడర్‌ని పలుచగా అద్దాలి. ఇలా చేస్తే లిప్‌స్టిక్‌ ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu