Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ ఒక కప్పు 200 గ్రాములు పుట్టగొడుగులు తింటే?

రోజూ ఒక కప్పు 200 గ్రాములు పుట్టగొడుగులు తింటే?
, బుధవారం, 27 జనవరి 2016 (11:10 IST)
పుట్టగొడుగులు అందరు తినే ఆహారపదార్థము. ఇవి మాంసాహారంతో సమానమైన పోషక విలువలను కలిగియుంది. భోజనప్రియులకు ఎంతో ఇష్టమైన పుట్టగొడుగులు శీతాకాలంలో విరివిగా దొరుకుతాయి. కృత్రిమంగా సాగయ్యేవి లభించినప్పటికీ సహజంగా వచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే. పుట్టగొడుగులలో "ఇర్గోథియోనైన్‌, సెలీనియం" అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. శరీరములో యధేచ్ఛగా సంచరిస్తూ డి.ఎన్‌.ఎ.ను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి ఎదుర్కొంటాయి. పుట్టగొడుగుల్లో 90 శాతం నీరే ఉంటుంది. సోడియం ఉండదు. పొటాషియం లభిస్తుంది, కొవ్వుపదార్ధం తక్కువ.. ఫలితంగా బరువు పెరుగుతామన్న భయమే ఉండదు .
 
బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే! ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. 
 
పచ్చి పుట్టగొడుగులలోని పదార్ధాలు జీర్ణ రసాల్నిమందగింపజేస్తాయి. శరీరం ప్రోటీన్‌‌లను గ్రహించడాన్నిఅడ్డుకుంటాయి. అంటే పుట్టగొడుగులను పచ్చిగా తిన్నట్లైతే వాటిలోని పోషక ప్రయోజనాల్ని పూర్తిగా పొందలేం. అందుకే వాటిని ఉడికించి తినాలి. కొన్నింటిలో విషపదార్ధాలు ఉంటాయి. ఉడికిస్తే విషపదార్ధాల ప్రభావం తగ్గుతుంది. ఉప్పునీటిలో కడిగి శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియాలు, క్రిములు తొలగిపోతాయి 
 
పుట్టగొడుగులో విటమిన్‌ డి పుష్కలంగా లభిస్తుంనందువల్ల... ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది. పుట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్‌పోజ్ చేయడం వల్ల విటమిన్‌ డి బాగా తయరవుతుంది . 
 
పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి, కండరాలకు, ఆక్షిజన్‌ సరఫరా అధికమైనందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది  గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు డయబిటీస్‌ను తగ్గిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu