Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెటబాలిక్ రేటును పెంచే గ్రీన్ యాపిల్స్...

మెటబాలిక్ రేటును పెంచే గ్రీన్ యాపిల్స్...
, బుధవారం, 27 జనవరి 2016 (09:26 IST)
'రోజుకో యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు', ఇది ఎప్పటి నుంచో తెలిసిన మాట. అయితే ఇది కేవలం సాధారణ యాపిల్‌కే కాదు, గ్రీన్ యాపిల్‌కు కూడా వర్తిస్తుంది. దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
గ్రీన్ యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీర జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని పోగొడుతుంది. జీర్ణవ్యవస్థ, ప్రధానంగా పేగులు శుభ్రమవుతాయి. ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, పొటాషియం వంటి మినరల్స్ వీటిలో అధికంగా ఉన్నాయి. ఇవి రక్తానికి అందే ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి. మెటబాలిక్ రేట్‌ను పెంచుతాయి. 
 
బరువు తగ్గాలనుకునే వారి కోసం గ్రీన్ యాపిల్ బాగా పనిచేస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారు రోజుకో గ్రీన్ యాపిల్‌ను తింటే మంచి ఫలితాలను సాధించవచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
 
గ్రీన్ యాపిల్స్‌లో ఉండే విటమిన్ సి చర్మానికి రక్షణనిస్తుంది. శరీరంలోని కణాల వినాశనానికి కారణమయ్యే ఫ్రీర్యాడికల్స్ ప్రభావాన్ని ఇది తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దరిచేరనీయని యాంటీ ఏజింగ్ గుణాలు గ్రీన్ యాపిల్స్‌లో ఉన్నాయి. చర్మానికి కాంతిని, ప్రకాశాన్ని ఇస్తాయి. 
 
శరీరంలో నాశనమైన కణాలను పునరుద్దరించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గ్రీన్ యాపిల్స్‌లో ఉన్నాయి. లివర్ సమస్యలకు ఇవి విరుగుడుగా పనిచేస్తాయి. ఎముకలకు దృఢత్వాన్ని చేకూరుస్తాయి. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. అల్జీమర్స్ రాకుండా కాపాడుతాయి. 
 
ఆస్తమాను తగ్గించే గుణాలు గ్రీన్ యాపిల్స్‌లో ఉన్నాయి. యాపిల్స్లాగే గ్రీన్ యాపిల్స్ కూడా మధుమేహాన్ని తగ్గిస్తాయి. 
 
గ్రీన్ యాపిల్ జ్యూస్‌ను జుట్టు కుదుళ్లకు తగిలేలా మర్దనా చేసి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu