Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే "విట‌మిన్ సి"

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే
, శుక్రవారం, 8 జనవరి 2016 (11:52 IST)
'విట‌మిన్ సి' ఆహార‌మంటే అధిక శాతం వ‌ర‌కు పులుపుగానే ఉంటుంది. కానీ ఈ రుచిని ఆస్వాదించేందుకు మ‌న‌లో అధిక శాతం మంది అంత‌గా ఆస‌క్తి చూపించ‌రు. కొంచెం పుల్లగా ఉండే సిట్రస్ పండ్లపై ఎవ‌రికీ అంత ఇష్టం కూడా ఉండ‌దు. అయితే వీటిని పక్కన పెడితే మాత్రం ఆరోగ్యాన్నిదూరం చేసుకోవడమే. ఎందుకంటే విట‌మిన్ "సి" లో ఉన్న పండ్ల‌ను తీసుకోక‌పోతే ర‌క్తం త‌గ్గిపోతుంది. ఎందుకంటే ఫ‌లాల్లో స‌మృద్ధిగా ఉండే విట‌మిన్ "సి"ని త‌గినంత తీసుకోక‌పోతే శ‌రీరం గ్ర‌హించుకునే ఐర‌న్ శాతం త‌క్కువ‌వుతుంది. 
 
తాజాగా ఉండే చాలా ఫలాల్లో విటమిన్ సి ఉంటుంది. ఉసిరి, జామ, నిమ్మ, టమాట, అనాస, బొప్పాయి, మామిడి, జీడిమామిడి వంటి పండ్లలో "సి" విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండే మధ్యవయస్సు వారు రోజుకి 50 నుంచి 75 మిల్లీగ్రాముల "సి" విటమిన్ తీసుకోవాలి. 
 
విటమిన్ 'సి లోపం వల్ల వచ్చే సాధారణ వ్యాధి స్కర్వీ. దీని వల్ల నోటిలో చిగుళ్లు వాచి, రక్తం కారుతుంది. ఒక్కోసారి ముక్కులోంచి రక్తం కూడా రావచ్చు. అదేవిధంగా చర్మం కింద ముఖ్యంగా కాళ్ల వెనుక భాగంలో అక్కడక్కడ రక్తం గ‌డ్డ కట్టుకుపోతుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానవు. రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారు. పిల్లల్లో ఎముకలు పెరగకపోవడం, ప్రతి చిన్న విషయానికి చిరాకుపడడం వంటి సమస్యలు ఏర్పడుతుంది. 
 
విటమిన్ 'సి' యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి ఫ్రీరాడికల్ డ్యామేజ్ కలగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం అవుతాయి. కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి విటమిన్ సి చాలా అత్యవసరం. ముఖ్యంగా దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. అందుకు విటమిన్ సి అధికంగా ఉన్నఆహారాలు తీసుకోమని నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu