Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ తీసుకుంటున్నారా? పిల్లలకు అస్సలొద్దు..!!

ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ తీసుకుంటున్నారా? పిల్లలకు అస్సలొద్దు..!!
, బుధవారం, 29 జులై 2015 (14:01 IST)
ప్లాస్టిక్ డబ్బాల్లో లంచ్ చేస్తున్నారా? అయితే హెయిర్ లాస్ తప్పదంటున్నారు.. బెంగళూరు పరిశోధకులు. మధ్యాహ్న భోజనం ప్లాస్టిక్ లంచ్ బాక్సుల ద్వారా తీసుకునే వారిలో జుట్టు రాలిపోవడం ఖాయమని, ప్లాస్టిక్ బాక్సుల్లో భోజనాలు చేస్తున్న వారికి మిగిలిన వారితో పోల్చితే జుట్టు వేగంగా ఊడిపోతుందని బెంగళూరుకు చెందిన హెయిర్ లైన్ ఇంటర్నేషనల్ అనే రీసెర్చ్ సెంటర్ తేల్చింది. 
 
ప్లాస్టిక్ పాత్రలు, ఆహారపు అలవాట్లు రక్తంలో బీపీఏ పెరిగేందుకు కారణమవుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసినవి కావడం వారిలో సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇక.. దాదాపు ఏడాది పాటు 430 మంది యువతులు, 570 మంది పురుషులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హెయిర్ లాస్ సమస్యతో చికిత్సలకు వస్తున్న వారిలో 92 శాతం మంది రక్తం, మూత్రం శాంపిళ్లలో ప్లాస్టిక్ (బీపీఏ-బిస్పెనాల్ ఏ) అధికంగా ఉన్నట్టు ఈ రీసెర్చ్‌లో వెల్లడైంది. బీపీఏను కొన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడతారు.
 
ఈ అధ్యయనంలో భాగంగా 20 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న ఉద్యోగులను ఎంచుకుని ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని తెచ్చుకుని తినేవారిపై పరిశోధనలు చేశారు. సుమారు 70 శాతం మెటబాలిక్ వ్యాధులు జుట్టు రాలిపోవడంతోన ప్రారంభమవుతున్నాయని కూడా రీసెర్చ్‌లో భాగంగా కనుగొన్నట్టు హెయిర్ లైన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక సీఈఓ బనీ ఆనంద్ వివరించారు.
 
మైక్రోవేవ్ ఓవెన్లను వాడటం ద్వారా శరీరంలోకి మరింత ప్లాస్టిక్ చేరుతోందని అపోలో హాస్పిటల్ క్లినికల్ డైటీషియన్ చీఫ్ ప్రియాంకా రోహత్గి అభిప్రాయపడ్డారు. సూర్యరశ్మిలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ఉంచడం వల్ల అవి నిదానంగానైనా కరిగిపోతూ, తాగే నీటిలోకి ప్లాస్టిక్ ఆనవాళ్లను పంపుతున్నాయని, వీటి స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్ ప్రొడక్టులను వాడాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu