Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొబైల్ ఫోన్లు పదేళ్ల కంటే ఎక్కువ వాడితే బ్రెయిన్ కేన్సర్ తప్పదట.. నిజమా?

మొబైల్ ఫోన్లు పదేళ్ల కంటే ఎక్కువ వాడితే బ్రెయిన్ కేన్సర్ తప్పదట.. నిజమా?
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (10:47 IST)
ప్రస్తుతం ఇప్పుడున్నరోజుల్లో జనాభా మనుషుల కంటే మొబైల్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మొబైల్ వాడకం ఎక్కువగా ఉన్న ఈ జనరేషన్‌లో మొబైల్ ఫోన్లు, సరదాలకు, ప్రిస్టేజిల కోసమే వాడుతున్నారు. అందుకే రోజుకో మోడల్ మొబైల్ ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతోంది. కానీ, ప్రతి నిత్యం మొబైల్ ఫోన్లను ఉపయోగించే వారికి, వాటి వల్ల ఏర్పడే భయంకర ఆరోగ్యప్రమాదాల గురించి తెలియకపోవచ్చు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం!
 
ఫోన్లలలో మాట్లాడుతూ కార్లు నడపడం వల్ల, ప్రమాదాలకు గురవుతున్నారు. డైవ్ చేస్తూనే, మొబైల్లో మెసేజ్‌లు లేదా మాట్లాడటం వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు
 
మరోవైపు మొబైల్‌ని ఎక్కువగా ఉపయోగించేవారిలో వినికిడి సమస్య ఏర్పడుతుంది. ధ్వనుల మధ్య ఉన్న తేడాలను పసిగట్టలేకపోతారు. చెవులకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటున్నారు నిపుణులు. చెవిలోని కాక్లియా, కర్ణభేరిలపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు చెవిలోని హెచెర్‌ సెల్స్‌ను దెబ్బతీయడంతో వినికిడిలోపం, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఫోన్లకు తప్పనిసరిగా కవర్‌ ఉండాలి. బెల్డ్‌ పౌచ్‌లోనే ఫోను ఉండాలి. జేబుల్లో పెట్టుకోవడం వల్ల రేడియేషన్‌ గుండెపై ప్రభావం చూపుతుంది.

Share this Story:

Follow Webdunia telugu