Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు తగ్గించాలా.. బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే?

బరువు తగ్గించాలా.. బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలంటే?
, బుధవారం, 28 జనవరి 2015 (14:12 IST)
బరువు తగ్గించాలా..? అయితే ఈ కథనం చదవండి. బరువు తగ్గాలని అనుకోగానే తిండిని తగ్గించేస్తారు. అయితే ఉదయం లేచాక ఉపాహారాన్ని భారీగా తినడం వల్ల ఇట్టే బరువు తగ్గిపోతారనుకుంటే పొరపాటే. 
 
కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, ఎక్కువగా ఉండే ఆహారం, ఒకటో అరో చాక్లెట్లు బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకున్నట్లైతే మిగతా రోజంతా ఆకలి పెద్దగా వేయక తిండి మీదకు మనస్సు పోదని, దీనివలన చిరుతిండ్ల శాతం తగ్గిపోయి బరువు తగ్గడానికి పరోక్షంగా ఎంతో దోహదపడుతుందని తాజా పరిశోధనలు వివరిస్తున్నాయి. 
 
ఉదయంపూట కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తినేవారికంటే ఎక్కువ కార్బొహైడ్రేట్లు ఉండే పదార్థాలతో కూడిన భారీ బ్రేక్‌ఫాస్ట్ చేసేవారికి ఐదురెట్లు బరువు తగ్గే అవకాశం అధికంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 
 
ఉదయం నిద్రలేస్తూనే మన శరీరం ముందుగా ఆహార పదార్థాలవైపు కన్నేస్తుంది. కార్టిసాల్, ఎడ్రెనలైన్ స్థాయిలు మాదిరి మెటాబాలిజం స్థాయిలు కూడా అత్యధికంగా ఉంటాయి. మెదడు శక్తిని డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఉదయం ఆహారం తగ్గించినా, తినకపోయినా మెదడు ఇతర విధాలుగా శక్తి కోసం ప్రయత్నిస్తుంది. అత్యవసరంగా కండరాల నుంచి శక్తిని లాగేస్తుంది. 
 
తర్వాత తినాలకున్నప్పుడు మెదడు ఆదేశానుసారం శరీరం ఆహారపదార్థాలలోని శక్తిని కొవ్వుగా నిల్వ చేస్తుంది. ఉదయం నిద్రలేచినప్పుడు మెదడులోని సెరోటోనిక్ (ఆకలిని నియంత్రించే రసాయనాలు) ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 
 
ఫలితంగా పొద్దున్నే ఆకలి తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏదైనా తినాలన్న కోరిక పెద్దగా ఉండదు. రాను రాను సెరోటోనిక్ స్థాయులు తగ్గి ఏదోకటి తినాలనే కోరిక పెరుగుతుంది. భారీగా బ్రేక్ ఫాస్ట్ తిన్నట్లయితే అవసరమైన శక్తి లభిస్తుంది.
 
తర్వాతి రోజంతా ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కనుక ఆకలి అంతగా ఉండదు. ఫలితంగా చిరు తిండ్ల జోరూ తగ్గి బరువు తగ్గుతారని పరిశోధకులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu