Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫీసులో మినరల్ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త సుమా!

ఆఫీసులో మినరల్ వాటర్ తాగుతున్నారా? జాగ్రత్త సుమా!
, సోమవారం, 28 జులై 2014 (15:14 IST)
ఆఫీసులో మినరల్ వాటర్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త సుమా! అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకంటే ఇంటి నుంచి ఆఫీసుకు రెండు బాటిల్స్ తీసుకెళ్లడం ఎంతో బెటరని వారు సూచిస్తున్నారు. ముంబైలో ఈ మధ్యే కార్పొరేట్ ఆఫీసుల్లో తాగునీటి సరఫరా విధానంపై ఎంజీఎం స్కూల్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఒక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో షాకింగ్ వివరాలు తెలియవచ్చాయి. ముంబైలోని 52 ప్రముఖ కార్పొరేట్ సంస్థలపై ఈ అధ్యయనం జరిగింది. మొత్తం కంపెనీల్లో 49 శాతం ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్‌ను ఏడాదికి ఒక్కసారే కడిగి శుభ్రం చేస్తారు. 
 
అంతే కాదు... ఉద్యోగుల్లో 92 శాతం మంది నీటి వల్ల కలిగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ కారణంగా చాలా మంది సెలవులు కూడా తీసుకోవలసి వచ్చింది. అన్నికంపెనీల్లోనూ నీటి సరఫరాను కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతోంది. అయితే వాటర్ జార్ల శుభ్రత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వాటి నాణ్యతను పరీక్షించే ఏర్పాటు ఏ సంస్థలోనూ లేదు. 
మంచి బ్రాండ్ లను తీసుకుని వస్తున్నారు కానీ, వాటర్ జార్ల నాణ్యతను మాత్రం పరీక్షించడం జరగడం లేదు. దీని వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
 
జీవితంలో ఎక్కువకాలం గడిపేది ఆఫీసుల్లోనే కాబట్టి ఆఫీసుల్లో మంచి నీరు అందించడమే కాదు, వాటిని పట్టి నింపే జార్లు, కంటెయినర్లు కూడా శుభ్రంగా ఉండాలని ఈ అధ్యయనం తెలియచేస్తోంది. ఇలా శుభ్రం చేయని వాటర్ ఫిల్టర్లు, జార్లు, వాటర్ బాటిల్స్ నీరు తాగితే రోగాల బారిన పడక తప్పదని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu