Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబుల్ చిన్‌కు చెక్ పెట్టాలా.. నాజూకైన మెడ కోసం..?

డబుల్ చిన్‌కు చెక్ పెట్టాలా.. నాజూకైన మెడ కోసం..?
, సోమవారం, 6 ఏప్రియల్ 2015 (18:54 IST)
మీరు డబుల్ చిన్ కలిగివున్నారా? సన్నని నాజూకైన మెడను పొందాలనుకుంటున్నారా..? గడ్డం, మెడ, ముఖం ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుని వ్యాయామాలు చేయడం మంచిది. ఆహారం, ఆరోగ్యం రెండు కూడా ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి. అందుచేత అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం మంచిది. దీనివలన వివిధ ఆహార సంబంధిత వ్యాధులు నివారించడం మాత్రమే కాకుండా అనవసర కొవ్వు పెరగడాన్ని నివారించుకోవచ్చు. 
 
ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఎక్కువ సోడియం తీసుకోవటం వలన శరీరంలో నీటి నిల్వ ఎక్కువగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ షేకర్ తొలగించండి. ఏ ఆహారంలో కూడా ఎక్కువ ఉప్పు వాడకండి. మీరు ఎలా కూర్చోవాలి? మీరు నిలబడినప్పుడు మరియు కూర్చుని ఉన్నప్పుడు మీ భంగిమను చూసుకోండి. మీరు తల వంచడం చేస్తున్నారా? మీ మెడ మరియు గడ్డం ప్రాంతాలలో కొవ్వు పెరగటానికి మరియు ముడుతలుగా ఏర్పడటానికి ఇది ఒక కారణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భుజాలు నిటారుగా మరియు వెనుకభాగం నిటారుగా ఉంచండి. మెడ ప్రాంతం యొక్క కండరాల పటుత్వం కోల్పోనివ్వవొద్దు, వాటిని వంగిపోనివ్వ కూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా జంక్ ఫుడ్‌ను మానేయడం మంచిది. తగినంత శరీర బరువును అంటే ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం ద్వారా నాజూకైన మెడను పొందవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన అవాంఛిత కొవ్వు పెరగకుండా సహాయపడుతుంది, శరీరాన్ని చురుగ్గా ఉంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu