Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ ఓ కప్పు ఆనియన్ సూప్ తాగితే?

రోజూ ఓ కప్పు ఆనియన్ సూప్ తాగితే?
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:56 IST)
ఉల్లి లేని వంటలంటూ ఏవీ ఉండవు. ఉల్లి లేని వంటలో రుచి ఏమాత్రం ఉండదని అందరికీ బాగా తెలుసు. ఉల్లిని ఆహారంలోకే కాదు.. ఆరోగ్యప్రదానికిగానూ మేలు చేస్తుంది. ఉల్లిని పచ్చిగానే తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.  
 
ఉల్లిలో విటమిన్ సి అధికంగా ఉంది. ముఖ్యంగా ఉడికించిన లేదా వేపిన ఉల్లిపాయల కంటే పచ్చిగా తినే ఉల్లిలోనే విటమిన్ సి పుష్కలంగా లభ్యమవుతుంది. పచ్చిగా తినడం ద్వారా ఉల్లిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా లభిస్తాయి. 
 
ఉల్లిలో ఫాట్ శాతం చాలా తక్కువ. అందుచేత ఒబిసిటీ దూరమవుతుంది. బరువును తగ్గించుకోవాలంటే ఆహారంలో తప్పకుండా ఎక్కువ మోతాదు ఉల్లిపాయలను చేర్చుకోవాలి. 
 
రక్తపోటును నియంత్రిచడంలోనూ ఉల్లిపాయ మాంచిగా పనిచేస్తుంది. ఆహారంలో ఉల్లిపాయల్ని ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. ఇంకా ఉల్లిపాయలు తలనొప్పి, దగ్గు, జ్ఞాపకశక్తి పెంచేందుకు ఉల్లిపాయలు పనిచేస్తాయి. 
 
మెదడును ఉత్తేజ పరిచేందుకు ఉల్లి పనికొస్తుంది. అందానికి కూడా ఉల్లి మంచి టానిక్‌గా పనిచేస్తుంది. అందుచేత రోజూ ఉల్లిపాయతో సూప్ తయారు చేసి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంతరించుకుంటారు. రోజూ నిద్రించేందుకు ముందు ఒక కప్పు ఆనియన్ సూప్ తాగితే అలసట, నీరసం వంటివి దూరమవుతాయి. ఇంకా ఉల్లిని ఉడికించి తేనె, కలకండలతో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తవు.

Share this Story:

Follow Webdunia telugu