Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

50 దాటిన పురుషులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

50 దాటిన పురుషులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (17:24 IST)
50 ఏళ్లు దాటాక ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియట్లేదా..? న్యూట్రీషన్లను సంప్రదించాలనుకుంటున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఈ స్టోరీ చదవండి. 50 ఏళ్లు దాటిన పురుషులు పోషకాహారంపై దృష్టి పెట్టాలని.. డయాబెటిస్ పేషెంట్లైతే స్పెషల్ కేర్ తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఐదు పదుల్లో ఉండే పురుషులు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలంటే.. చేపల్ని వారానికి రెండుసార్లైనా తప్పక తీసుకోవాలి.
 
చేపల్లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్, ట్యూనా, హలిబుట్ వంటి చేపలతో పాటు ఇతర సీ ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమం. అలాగే తాజా పండ్లు కూడా శరీరానికి కావలసిన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయి. అందువలన రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సీజన్‌వారీగా అందుబాటులో ఉండే పండ్లు చాలా ఉన్నాయి. వీటిని తప్పకుండా తీసుకోవాలి. 
 
తీపి పండ్లలో చక్కెర స్థాయిలు ఉండుట వలన, వాటికీ ఉపయోగించేటప్పుడు వాటికి పంచదార ఉపయోగించకూడదు. అలాగే తాజా పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే భోజనం సులభంగా జీర్ణం కావడానికి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచటానికి ఫ్రూట్ జ్యూస్‌లు ఎంతగానో సహాయపడుతాయి.

Share this Story:

Follow Webdunia telugu