Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలు.. రోజుకు రెండు గ్లాసులకు మించితే...

పాలు.. రోజుకు రెండు గ్లాసులకు మించితే...
, గురువారం, 30 అక్టోబరు 2014 (17:25 IST)
ప్రతి ఒక్కరూ పాలు ఆరోగ్యానికి మంచిదని అంటుంటే..  రోజుకు రెండు గ్లాసులకు మించి పాలు తాగితే ప్రాణానికే ప్రమాదం అనే దిగ్భ్రాంతికర సమాచారం వెల్లడైంది. ఈ విషయం స్విడన్ దేశానికి చెందిన ఉప్పసలా యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది. 
 
ఆ యూనివర్శిటీ రోజు పాలు తాగడం వల్ల కలిగే పేలు, కీడులపై ఏళ్ల తరబడిగా పరిశోధనలు నిర్వహించింది. ఆ పరిశోధన ద్వారా పాలు ఎక్కువ తాగితే ప్రాణానికే ప్రమాదం అని తెలిసింది. 
 
ఈ విషయమై ఉప్పసలా యూనివర్శిటీ అధ్యాపకులు కార్ల్ మైకెల్సన్ మాట్లాడుతూ... పాలను సేవించడం వల్ల వచ్చే మంచి, చెడులను గురించి గత 20 సంవత్సరాలుగా పరిశోధనలు చేశామన్నారు. వారి పరిశోధనకు 61 వేల మంది మహిళలు, 45 వేల మంది వద్ద ఈ పరిశోధనకు ఉపయోగించుకున్నట్టు తెలిపారు.
 
తమ పరిశోధనలో అనేక విషయాలు వెల్లడైనట్టు చెప్పారు. అయితే అత్యధికంగా పాలు తాగడం వల్ల ఎముకలకు జరిగే మేలు కొంతేనని, నష్టం ఎక్కువని తెలిసిందన్నారు. ప్రతి రోజూ రెండు గ్లాస్‌లకు మించి అంటే అర లీటర్ లేక అంతకు మించి పాలు తాగే వారికి పలు విధాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడడమే కాకుండా త్వరగా ప్రాణాలు కోల్పోతారనే చేదు సమాచారం తేలిందన్నారు. 
 
తక్కువ పాలు తాగే వారి కంటే కూడా ఎక్కువ పాలు తాగే వారే అతి త్వరగా ప్రాణాలు కోల్పోతున్నట్టు వారి అధ్యయనం ద్వారా తేటతెల్లమైందన్నారు. పాలలో ఉండే ల్యాక్టోస్, క్లాక్ టోస్ అనే చక్కెర స్వభావం వలన పలు అనారోగ్య సమస్యలు ఏర్పడి, చివరికి ప్రాణాలనే హరిస్తుందని తెలిపారు.
 
కనుక ఇకపై పిల్లలు, పెద్దలు పాలు తాగే విషయం జాగ్రత్త పాటించాలి. ఎట్టి పరిస్థితిలోను రోజుకు రెండు గ్లాసులకు మించి పాలు తాగరాదు. 

Share this Story:

Follow Webdunia telugu