Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు ఇష్టానికి లాగిస్తున్నారా?

ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు ఇష్టానికి లాగిస్తున్నారా?
, సోమవారం, 30 మార్చి 2015 (16:57 IST)
ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు ఇష్టానికి లాగిస్తున్నారా? అయితే మెదడుకు కష్టాలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే స్థూలకాయం, రక్తపోటు వంటి వ్యాధులతో పాటు.. మెదడు ఆలోచన స్థాయిపై ప్రభావం చూపుతాయని తాజా పరిశోధనల్లో తేలింది. 
 
పరిమితికి మించిన కొవ్వున్న ఫుడ్ అతిగా తీసుకుంటే, ఏకంగా మెదడు ఆలోచన స్థాయిలో నిలకడ తప్పుతుందని, మానసిక వైకల్యం తలెత్తి, తీవ్ర ఒత్తిడి తప్పదని పరిశోధకులు వెల్లడించారు. పరిమితికి మించిన కొవ్వున్న ఆహారపదార్థాలు తినే వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తుందని, మెదడువాపు వ్యాధి కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉందని లుసియానా యూనివర్శిటీ చెందిన పరిశోధకులు తెలిపారు. 
 
కొవ్వుతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల ఏర్పడే అనర్థాలు అనే అంశంపై చేసిన పరిశోధనల వివరాలను బయోలాజికల్ సైకియాట్రి అనే జర్నల్‌లో ప్రచురించారు. నాడీ వ్యవస్థపై కొవ్వు పదార్థాలు తీవ్ర ప్రభావం చూపినట్టు గుర్తించామన్నారు. జీర్ణాశయం నుంచి మెదడుకు వెళ్లే సమాచార వ్యవస్థలో కొవ్వు కారణంగా మార్పులు చోటుచేసుకుంటాయని, దీని వల్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీవ కణజాలం నిర్లిప్తంగా తయారవుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu