Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆలస్యంగా నిద్రపోతే ఆందోళన తప్పదు...!

ఆలస్యంగా నిద్రపోతే ఆందోళన తప్పదు...!
, గురువారం, 18 డిశెంబరు 2014 (16:19 IST)
నగర ప్రాంతాలలో ఉండేవారిలో చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతుంటారు. ఇది వారికి అలవాటు అయినప్పటికీ, అస్సలు మంచి పద్ధతికాదంటున్నారు శాస్త్రవేత్తలు. పగలు ఎంత నిద్రపోయినా అది లెక్కలోకి రాదని, రాత్రి నిద్రే ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు.  
 
రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోతే ఆందోళనలు తప్పవట. రాత్రుల్లో ఎన్ని గంటలు మనం నిద్రపోయామన్న దాన్ని బట్టి ఎంత ఆందోళనతో మనం ఉన్నామన్నది కూడా తెలుస్తుందని వారంటున్నారు. అంతేకాదండోయ్... రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవాళ్లలో ప్రతికూల ఆలోచనాధోరణులు ఎక్కువగా ఉంటాయని తెలుపుతున్నారు. 
 
నిద్రపోయే సమయాన్ని కచ్చితంగా పాటించేవాళ్లల్లో ఇలాంటి ప్రతికూల ఆలోచనాధోరణులు ఉండవట. ప్రతికూల ఆలోచనాధోరణులున్న వాళ్ల ఆలోచనా తీరు ఎప్పుడూ నిరాశాజనకంగా ఉంటుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. 
 
అంతేకాదు ఇలాంటి వాళ్లు తమ భవిష్యత్ గురించి ఎక్కువగా ఆందోళనపడిపోతుంటారట. గతంలో చేసిన తప్పుల గురించే ఎక్కువగా ఆందోళనపడిపోతుంటారట.దీంతో ఎప్పుడూ చికాగ్గా, అసంతృప్తిగా ఉంటారట. 
 
రాత్రి నిద్ర తగ్గితే యాంగ్టయిటీ డిజార్డర్, డిప్రసివ్ డిజార్డర్, పోస్ట్ - ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఆబ్ససివ్ కంపల్సివ్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ల వంటి వాటితో బాధపడే వాళ్ల తీరు కూడా ఇలాగే ఉంటుందట. వీరు కూడా ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. 
 
అదేవిధంగా సరిపడినంత నిద్ర లేకపోవడానికి, ప్రతికూల ఆలోచనాధోరణికి చాలా దగ్గర సంబంధం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. క్రమంతప్పకుండా వేళకి నిద్రపోయేవాళ్లు ఇలాంటి డిజార్డర్ల బారిన పడే అవకాశం చాలా తక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు. కనుక నగరమైనా, పట్టణమైనా రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించడం.. కనీసం నిద్ర ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవడం ఎంతైనా అవసరం.

Share this Story:

Follow Webdunia telugu