Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనారోగ్య సమస్యలా.. అయితే బరువు తగ్గించండి!

అనారోగ్య సమస్యలా.. అయితే బరువు తగ్గించండి!
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:56 IST)
అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే ఏకైక మార్గం బరువు తగ్గాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒబిసిటీ ద్వారా అందం కోల్పోవడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 
 
మన దేశంలో 30 నుంచి 50 శాతం మందికి అధిక బరువు కారణంగానే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, పక్కవాతం, నడుము నొప్పి, మోకాలి నొప్పి, పాదాల్లో నొప్పి, నెలసరి సమస్యలు, సంతాన లేమి, కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఒబిసిటీతో బాధపడేవారు.. అనారోగ్య సమస్యలతో డాక్టర్లకు భారీ మొత్తం వెచ్చిస్తున్నారని తేలింది. కానీ వైద్యులకు ఖర్చు పెట్టేకంటే శరీర బరువును తగ్గించడం వైపు దృష్టి సారిస్తే అనారోగ్యానికి దూరంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు చెబుతున్నారు. 
 
బరువు తగ్గడం ద్వారా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆయుష్షు పెరుగుతుంది. ఇంకా పిల్లల్లో ఒబిసిటీ జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. అందుచేత బరువు తగ్గితే జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
 
బరువు తగ్గేందుకు 3 చిట్కాలు: 
* డైట్ ఫాలోకావడం 
* వ్యాయామం
* మందులు తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట పరిమితంగా భోజనం తీసుకోవాలి. మధ్య మధ్యలో రెండు కప్పులు శెనగలు వంటి ధాన్యాలు తీసుకోవచ్చు
 
రోజు కోడిగుడ్డును తీసుకోవచ్చు. వారం 3 సార్లు చేపలు డైట్‌లో చేర్చుకోవాలి. అయితే మటన్, చికెన్‌లను తీసుకోకూడదు. 
 
ఇక వ్యాయామం సంగతికి వస్తే రోజూ అరగంట పాటు ఎక్సర్‌సైజ్ చేయాలి. ప్రతీ అరగంటకు ఒకసారి ఐదు నిమిషాల పాటు నడవాలి. ప్రతిరోజూ 19వేల అడుగులు (ఆరున్నర కి.మీ) నడవడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవు. 
 
పార్కుల్లో నడవడం కంటే పిల్లలతో ఆడుకుంటేనే.. వ్యాయామం చేసినట్లవుతుంది. డాక్టర్ల సలహా మేరకు మందులు తీసుకుంటే కూడా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu