Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డైట్‌లో రాగుల్ని చేర్చుకోండి.. వయస్సును తగ్గించుకోండి!

డైట్‌లో రాగుల్ని చేర్చుకోండి.. వయస్సును తగ్గించుకోండి!
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (17:13 IST)
రాగులను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. మిల్లెట్ అనే రాగుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. అందువల్ల యాంటీ-ఏజింగ్‌కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు. 
 
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. 
 
ఇంకా రాగుల్లో ఉన్న క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.
 
సాధారణంగా రాగులతో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్‌గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన, వ్యాకులత,  నిద్రలేమి పరిస్థితులను దూరం చేస్తుంది. రాగి మైగ్రేన్ సమస్యను నివారించడం కోసం కూడాఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu