Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా..? ఏమౌతుంది?

ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా..? ఏమౌతుంది?
, శుక్రవారం, 27 మార్చి 2015 (20:37 IST)
మామూలుగా ఎవరైనా అతిథి ఇంటి వస్తే చల్లనీళ్ళిచ్చి సేదదీర్చుతాం. ఎండన పడి వచ్చిన వారు కూడా కాసిన్ని ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని అడుగుతారు. మరికొందరు ఆహారం తీసుకునేప్పడు కూడా చల్లని ఫ్రిజ్ నీటిని తాగుతుంటారు. మరి ఇది తప్పా...? ఒకవేళ భోజనం చేసేటప్పుడు చల్లని నీటిని తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకున్న నూనె, కొవ్వు పదార్థాలు గడ్డకటిపోతాయా..? అయితే ఏం జరుగుతుంది..? వీటన్నింటికి జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వాళ్లు ఏం చెపుతున్నారో చూద్దాం రండీ.
 
భోజనం చేసిన తరువాత ఒక గ్లాసుడు చల్లని నీళ్లు తాగితే అంతకంటే హాయి ఇంకేముంటుంది చెప్పండి.. ఇది సహజంగా అందరిలోని భావన కానీ నీళ్ళు తీసుకున్న తరువాత ఉదరంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలిగా..! దీనిపై శాస్త్రవేత్త పరిశోధనలు చేశారు. చల్లని నీరు తీసుకుంటే మనం తిన్న ఆహార పదార్థాలలోని నూనెలతో కలసి ఘన జిగటైన పదార్థాలను తయారు చేస్తారు. 
 
దీని వలన అది జీర్ణాశయంలోకి వెళ్ళకుండా పేగులకు అంటుకుంటుంది. ఫలితంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాలలో కొవ్వు పదార్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఇదే క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే జపాన్ శాస్త్రవేత్తలు ఓ సూచన చేస్తున్నారు. ఆహారం తిన్న తరువాత గోరు వెచ్చని నీటిని తీసుకుంటే అది పదార్థాలలోని నూనెను కరిగించి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుందని చెప్పుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu