Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చక్కెర వ్యాధిగ్రస్తులు పరగడుపున నీళ్ళు తాగితే... ఏమిటి లాభం..?

చక్కెర వ్యాధిగ్రస్తులు పరగడుపున నీళ్ళు తాగితే... ఏమిటి లాభం..?
, బుధవారం, 25 మార్చి 2015 (21:04 IST)
చాలా మంది ఆయుర్వేద వైద్యులు నోరు తెరిస్తే చెప్పేది ఒక్కటే నీరు ఎక్కువగా తీసుకోండి ఉదయం మొదలు పెట్టినప్పటి నుంచి వీలైనన్ని ఎక్కువ నీళ్ళ ు తీసుకోమని పదే పదే చెబుతుంటారు. ప్రత్యేకించి చక్కెర వ్యాధిగ్రస్తులు దీనిని తప్పనిసరిగా పాటించాలని అంటుంటారు. మరి పరగడుపునే నీళ్ళు ఎందుకు తీసుకోవాలి. దాని వలన లాభలేంటి? అనే అంశంపై ఈ మధ్యలో జపాన్ శాస్త్రవేత్తలు పెద్ద పరిశోధనలే చేశారు. చివరకు నీరు తాగితే లాభాలేంటో తేల్చి చెప్పారు. నీళ్ళు మాత్రమే తీసుకోవడం వలన ఎన్నో జబ్బులను నియంత్రించవచ్చునని మరెన్నింటినో నివారించవచ్చునన చెప్పారు. వివరాలు తెలుసుకుందాం. నీటికి అంతటి మహత్యం ఉందట. వారు చెప్పిన విధానం ఏంటో చూద్దాం. రండీ  
 
నీటిని తీసుకోవాల్సిన విధానం
 
ఉదయం లేవగానే పళ్ళుతోముకోవడానికి ముందే కనీసం 160 మి.లీ. చొప్పున నాలుగు గ్లాసుల నీటిని తాగాలి. తరువాత బ్రష్ చేసుకోవచ్చు, నోరు కడుక్కోవచ్చు. కానీ 45 నిమిషాల పాటు ఏమి తిన కూడదు. తాగకూడదు. తరువాత ఏమైనా తినవచ్చు. తాగవచ్చు.  అల్పాహారం తీసుకున్న తరువాత కనీసం 15 నిమిషాల పాటు నీరు సేవించరాదు. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనం తరువాత కనీసం రెండు గంటల పాటు నీటిని సేవించరాదు. ఒకవేళ ఎవరైనా నీటిని తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న వారు, వృద్ధులు అయితే కొంచెం కొంచెం నీటిని తీసుకుంటూ మోతాదదును పెంచుకుంటూ రావాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చునని చెపుతున్నారు. 
 
 
ఏ ఏ రోగాలకు ఎన్ని రోజులు పాటించాలి. 
 
1. అధిక రక్తపోటుకు 30 రోజులు
2. గ్యాస్ట్రిక్ 10 రోజులు
3. మదుమేహవ్యాధి 30 రోజులు
4. మలబద్దకం 10 రోజులు  
5. క్యాన్సర్ 180 రోజులు 
6. టీబీ 90 రోజులు  
 
అర్థ్రటీస్ ఉన్న వారు మొదటి వారం మాత్రం మూడు రోజులు మాత్రమే పాటించాలి. రెండో వారం నుంచి ప్రతీరోజూ పాటించవచ్చు. ఈ విధానం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. కాకపోతే కొంత కాలం ఎక్కువ మార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu