Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తలంటు స్నానం చేసిన రోజున దాంపత్య సుఖం పొందవచ్చా?

తలంటు స్నానం చేసిన రోజున దాంపత్య సుఖం పొందవచ్చా?
, గురువారం, 25 జూన్ 2015 (15:36 IST)
తలకు నూనె రాసుకుని స్నానం చేయడాన్ని తలంటు స్నానం అంటాం. ఇది భారత సాంప్రదాయ పద్దతులలో ఒకటి. ఈ విధంగా తలకు, శరీరానికి నూనె రాసుకుని స్నానం చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఉత్సాహం ఏర్పడుతుంది. ఈ ఉత్సాహ సమయంలో మరింత ఉత్సాహంగా ఉండేందుకు దంపతులు ఇష్టపడుతుంటారు. 
 
అయితే తలంటు స్నానం చేసిన రోజున దాంపత్య సుఖం పొందవచ్చా? కూడదా?, తలంటు స్నానం ఎలా ఆచరించాలి వంటి అనేక సందేహాలను పలువురు వ్యక్తంచేస్తుంటారు. అటువంటి వారి సందేహాలకు సమాధానాలను ఈ క్రింది కథనం ద్వారా తెలుసుకోవచ్చు.
 
తల వెంట్రుకలకు, శరీరమంతటికీ నూనె రాసుకుని స్నానం చేయవచ్చు. పురుషులు తలనంటు స్నానాన్ని శనివారం లేదా బుధవారం మాత్రమే ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే మహిళలైతే మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో తలంటు స్నానం చేయాలి.

ముఖ్యంగా ఉదయం పూట ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు నూనెను రాసుకుని స్నానం చేయడమే మంచిది. తలకు, శరీరమంతటికీ నూనె రాసుకుని 15 నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత స్నానం చేయాలి. నూనె రాసుకున్న తర్వాత ఎక్కువ సమయం అలాగే ఉండకూడదు. 
 
తలంటు స్నానం చేసిన తర్వాత బాగా విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అంటే వెంటనే నిద్రపోవడం కాదు. శ్రమతో కూడిన పనులు ఏవీ చేయకుండా పూజ, పుస్తక పఠనం వంటివి చేయవచ్చు. ఆ సమయంలో ఒంటికి చలువ చేసే పళ్లు, మజ్జిగ, పెరుగు, పాలు, పళ్ల రసాలు, ఐస్ క్రీమ్‌లు వంటి వాటిని తీసుకోరాదు. 
 
తలంటు స్నానం చేసిన రోజున భార్య భర్తల మధ్య దాంపత్య సుఖం ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. అయితే అది కేవలం అపోహ మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలి. తలంటు స్నానం చేసిన సమయంలో దంపతులకు ఉత్సాహం పెరుగుతుంది. ఆ సమయంలో దంపతులు సెక్స్‌లో పాల్గొంటే, సెక్స్ సుఖం మరింత పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu