వరుస కాన్పుల కంటే అబార్షన్ మేలు : వైద్యుల సలహా

గురువారం, 4 సెప్టెంబరు 2014 (17:13 IST)
మహిళలు వరుసగా గర్భం ధరిస్తే అబార్షన్ చేసుకోవడం మంచిదేనని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వరుస గర్భధారణతో శరీరానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైపెచ్చు.. ఆరోగ్యవంతమైన శిశువు కోసం అబార్షన్ చేసుకోవడం మేలేనని గైనకాలజిస్టులు, నర్సులు, కౌన్సిలర్లు చెపుతున్నారు. 
 
వరుసగా గర్భం దాల్చే పద్ధతి కంటే ఒక శిశువు రెండో శిశువుకు మధ్య గ్యాప్ తీసుకోవడం లేదా వరుసగా గర్భం ధరిస్తే అబార్షన్ చేసుకోవడం వల్ల తల్లి శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. అబార్షన్ ద్వారా సైకాలజికల్ ముప్పు నుంచి తప్పుకోవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు. 
 
వరుస గర్భం నుంచి తప్పుకునేందుకు అబార్షన్ చేసుకోవడం ద్వారా అనారోగ్యం, మానసిక సమస్యల నుంచి దూరం కావచ్చు. ఇంకా శారీరక సమస్యల నుంచి బయటపడవచ్చు. వరుస ప్రెగ్నెన్సీని క్రమబద్ధీకరించేందుకు అబార్షన్ మేలేనని అది సైకలాజికల్ హెల్త్‌ను చేకూరుస్తుందని బ్రిటన్ వైద్యులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి