Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20 నిమిషాలు నవ్వండి... ప్లీజ్

20 నిమిషాలు నవ్వండి... ప్లీజ్
, గురువారం, 10 జనవరి 2008 (13:55 IST)
ప్రపంచ హాస్య దినోత్సవాన్ని ప్రతి ఏటా మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. అయితే భారతదేశం విషయానికి వస్తే.... 1998 జనవరి 11న మొదటిసారిగా ఈ హాస్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. డాక్టర్ మదన్ కటారియా ఆధ్వర్యంలో ముంబైలో ఈ ఉత్సవం జరిగింది.

అసలు సృష్టిలో నవ్వగలిగే ఏకైక జీవి మనిషి. అయితే దురదృష్టవశాత్తూ మనుషుల్లో 99 శాతం మంది పూర్తి స్థాయిలో నవ్వలేకపోతున్నారు. ఫలితంగా మానసికంగా కృంగిపోయి స్వభావులై అనేక అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లి వ్యాయామం చేసినట్లు లాఫింగ్ క్లబ్బులకు వెళ్లి నవ్వి వస్తున్నారు. దీనివల్ల ప్రపంచంలోని ఐదు ప్రధాన ఖండాలలో దాదాపు 5 వేలకు పైగా లాఫింగ్ క్లబ్బులు వెలిశాయి.

అసలు నిత్యజీవితంలో హాస్యం ఎటువంటిదో మన పెద్దలు ఎన్నడో వివరించి చెప్పారు. నవరసాలలో హాస్యరసానికి పెద్దపీట వేశారు. మిగిలిన అన్ని రసాలను పండించటం సులభమేననీ, హాస్య రసాన్ని పండించటం చాలా కష్టంతో కూడుకున్న పని అని అనుభవజ్ఞులు ఎన్నడో సూచించారు.

ముఖ్యంగా నేటి బిజీ జీవితంలో నవ్వుకు కావలసిన పరిస్థితులే ఏర్పడటం లేదు. సరదా జీవితాలు తగ్గిపోతున్నాయి. ఇళ్లలో పిల్లలు తక్కువ... తోటి పిల్లలతో ఆడుకునే అవకాశం ఇవ్వని తల్లులు. ఫలితంగా సరదాగా గడపాల్సిన వయసు నుంచే పోట్లాటలు, పట్టుదలలు పెరుగుతున్నాయి.

ఇళ్లలో నేడు పిల్లలకు కనిపించే కామెడీ కార్టూన్ నెట్ వర్క్ కార్యక్రమాలే... ఇక పెద్దవారి విషయానికి వస్తే... రోజుకి ఎన్నిసార్లు నవ్వారు అంటే... ఒకటి రెండుసార్లు అదీ మితంగా అన్న సమాధానం వస్తుంది. ఆరోగ్యంగా...సంతోషంగా ఉండాలంటే... కనీసం రోజుకి 20 నిమిషాలయినా నవ్వి తీరాల్సిందేనంటున్నారు నిపుణులు. నవ్వండి... ఆనందంగా ఉండండి.

Share this Story:

Follow Webdunia telugu