Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాయు కాలుష్యం గుండెపోటుకు మూలం

వాయు కాలుష్యం గుండెపోటుకు మూలం

Gulzar Ghouse

గుండెకు సంబంధించిన జబ్బులు కేవలం వారసత్వ లక్షణాలవలనే కాకుండా వాయు కాలుష్యం వలనకూడా గుండెపోటు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూనివర్శిటీ ఆఫ్ లూయిస్ విల్లే‌కు చెందిన అరుణీ భట్నాగర్ పేర్కొన్నారు.

వాయు కాలుష్యం వలన గుండెపోటుకుగురై మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్‌లో అత్యధిక సమయం గడిపేవారు గుండెపోటుకు గురౌతున్నట్లు పరిశోధనల్లో తేలినట్లు అరుణీ తెలిపారు.

వివిధ రకాల రసాయనాలతో కూడుకున్న వాహనాల ద్వారా వెలువడే పొగ, సిగరెట్ పొగ, కార్ల ద్వారా వచ్చే కాలుష్యం వలన రక్తంలో కొవ్వు శాతం అధికమైనట్లు పరిశోధనులు చెబుతున్నాయని ఆమె వివరించారు.

దీనివలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుపోవడం, లేదా రక్తనాళాలు మూసుకు పోవడం జరుగుతుందని దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె వివరించారు.

కాలుష్యం బారిన పడే ప్రాంతాలలో నివసించే ప్రజలు తమ ఇంట్లోనే కాస్త వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉన్న గాలి కాస్త శుభ్రంగానే ఉంటుందని వైద్యులు తెలిపారు. కాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో ప్రయాణాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలని వారు పేర్కొన్నారు.

ఇదిలా వుండగా వాతావరణ కాలుష్యం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఇది గుండెపోటుకు దారితీస్తుందని తెలిపారు. కాలుషంలోనున్న అతి సూక్ష్మమైన పదార్థాలు ఊపిరి తిత్తులలోకి ప్రవేశించి తద్వారా రక్తనాళాలలోకి ప్రవేశిస్తాయని దీంతో గుండెకు సరఫరా అయ్యే రక్తంలో ఇవి చొరబడి గుండెపోటుకు దారితీస్తాయని పరిశోధనల్లో తేలినట్లు వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu