Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి!?

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి!?
, మంగళవారం, 1 నవంబరు 2011 (14:11 IST)
FILE
వర్షాకాలంలో ఎంత జాగ్రత్తపడినా తడవడం తప్పదు. జలుబు, దగ్గు, గొంతునొప్పిలాంటి సమస్యలు మామూలే. వీటి నివారణకు ఆహారంలో మార్పులు తోడ్పడతాయి.

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోనడమే సులువైన ప్రాథమిక జాగ్రత్త. అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారినుంచి మనల్ని మనం కాపాడుకోవాలి.

అందుకే ఈ సమయంలో రోజూ ఆరేడుసార్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంతవరకు కాపాడుకోవచ్చు. జలుబుతో బాధపడతున్నవారితో కలిసి పానీయాలు, లిప్‌స్టిక్‌లు, ఇతర వస్తువులను పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారితశానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకుంటే క్రిములు నశిస్తాయి.

ఇవి కాకుండా...
* తాజాపండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి.
* పండ్లరసాలు, పండ్లసలాడ్‌లను సిద్ధం చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే తీసుకోవాలి.
* సాధ్యమైనంతవరకూ ఆహారాన్ని వేడివేడిగాతినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి.
* పెరుగు, మజ్జిగలను తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
* ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు కడిగి, బాగా ఉడకనిచ్చి ఆ తర్వాతే తినాలి.
* జలుబు, దగ్గు తదితరాలకు పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలుచేస్తాయి. రంగురంగుల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సీడెంట్లు, బీటాకెరొటిన్, విటమిన్ ఇ, సి, సెలెనియం సమృద్ధిగా అందుతాయి. పెరుగులోని బాక్టీరియా కూడా జలుబు నుంచి సంరక్షిస్తుంది.
* కర్బూర, ఆఫ్రికాట్ల గుజ్జు, తాజా పెరుగు
* మంచినీళ్లు, టమాట రసం
* సూప్‌లలో కూరగాయలను ఎక్కువగా చేర్చాలి.
* పుచ్చకాయ ముక్కలను నిత్యం తీసుకోవాలి.
* తాజా మొలకెత్తిన గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
* మాంసాహారం, కొవ్వుశాతం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. దీనివల్ల శాచురేటెడ్ కొవ్వు శాతం తగ్గుతుంది. జలుబు కారక క్రిములను నివారించే సి విటమిన్ నిమ్మకాయలో ఉంది కాబట్టి సమృద్ధిగా నిమ్మజాతిపండ్లను తినాలి.

Share this Story:

Follow Webdunia telugu