Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రకావాలట.!

రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రకావాలట.!
FILE
అవునండి రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రకావాలట.! వయస్సు, ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రోజుకి 7-8 గంటల పాటు నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నిద్ర ద్వారా శరీరంలోని అవయవాలన్నీ రీచార్జ్‌ అవుతాయి. ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్‌ హార్మోన్‌ నిద్రతో ముడివడి ఉంటుంది. అందుకే చిన్నారులు ఎక్కువ సేపు నిద్ర పోతారు. దీని వలన వారిలో గ్రోత్‌ హార్మోన్‌ ఎక్కువగా స్రావితం అవుతుంది. ఫలితంగా చిన్నారులు చక్కగా ఎదగగలుగుతారు.

అందుకే పసికందులు 15-18 గంటల పాటు నిద్రలోనే ఉంటారు. ఎదిగే కొద్దీ ఈ సమయం తగ్గుతూ వస్తుంది. బడికి వెళ్లే పిల్లలకు 10-12 గంటల పాటు నిద్ర అవసరం. పెద్ద వాళ్లలో ముఖ్యంగా మహిళల్లో నిద్ర అవసరం చాలా కనిపిస్తుంది.

తగినంత నిద్ర లేకపోతే వ్యాధి నిరోధక శక్తి జనించదు. దీని వలన తేలిగ్గానే చిన్నా చితక రోగాల బారిన పడతారు. అంతేగాకుండా మెదడులో హార్మోన్‌‌ల స్రావం దెబ్బ తింటుంది. అందుచేత ఈ ఫాస్ట్ యుగంలో రోజుకు 8 గంటలు నిద్రకు కేటాయించడం చాలా అవసరం.

Share this Story:

Follow Webdunia telugu