Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మఖ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన జాతకులైతే!?

మఖ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన జాతకులైతే!?
FILE
మఖ నక్షత్రం నాలుగో పాదములో జన్మించిన జాతకులు పుట్టిన రెండు సంవత్సరాల వయస్సు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు. రెండు సంవత్సరముల నుంచి 22 సంవత్సరమువ వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించగలరు.

22 నుంచి 28 సంవత్సరముల వరకు ఈ జాతకులు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 28-38 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.

38-45 సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించగలరు. 45 నుంచి 63 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు.

63-79 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu