Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గణపతి ప్రార్థన

గణపతి ప్రార్థన
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (15:37 IST)
WD PhotoWD
ప్రమదగణనాథునికి జయమంగళం
శ్రీ శంభు తనయునకు సిద్థిగణనాథునకు
వాసిగల దేవతా వందితునకు
ఆ సరస విద్యలకు ఆదిగురువైనట్టి
భూసురోత్తమ లోకపూజ్యునకు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

నేరేడు మారేడు నెలవంక మామిడి
దూర్వార చెంగల్వలుత్తరేణు
వేరువేరుగ తెచ్చి వేడ్కతో పూజింతు
పర్వమున దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

సుచిగ భాద్రపద శుద్ద చివితియందు
పొసగ సజ్జనులచే పూజగొంచు
శశి చూడారాకున్న చేకొంటినొక వ్రతము
పర్వముగ దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

పానకము వడపప్పు, పనసమామిడి పండ్లు
దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు
మాకు బుద్థిచ్చు గణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళమీదికి దండుబంపు
కమ్మని నెయ్యియును కడుపప్పుయును
బొజ్జనిండా దినుచు పొరలుకొనుచు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

webdunia
WD PhotoWD
వెండి పళ్ళెరములోన వేవేల ముత్యాలు
కొండలుగ నీలములు కలియబోసి
మెండుగను హారములు మెడనిండ వేసికొని
దండిగా నీకిత్తు ధవళారతి
IIజయమంగళం నిత్య శుభమంగళంII

పువ్వులను నిను గొల్తు పుష్పాల నిను గొల్తు
గంధాన నినుగొల్తు కస్తూరిని
ఎప్పుడును నిను గొల్తు ఏకచిత్తంబున
పర్వమున దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

ఏకదంతంబును ఎల్ల గజవదనంబు
వాలైన తొండంబు వలపు కడుపు
జోకయిన మూషికము సొరది నెక్కాడెడు
భవ్యమున దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

మంగళము మంగళము మార్తండతేజునకు
మంగళము సర్వజ్ఞవందితునకు
మంగళము ముల్లోక మహితసంచారునకు
మంగళము దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

మోదుగము వుండ్రాళ్ళు
ముద్ద పప్పుతో నెయ్యియు
ఆదిగాగల తేనే అమృతాన్నముల్
ఆదరంబుగ తృప్తి తానారగింపుచును
పర్వమున దేవగణపతికినిపుడు
IIజయమంగళం నిత్య శుభమంగళంII

ఓ బొజ్జ గణపతి! ఓర్పుతో రక్షించి
కాచి నన్నేలు మీ కరుణతోను
మాపాలగలవని మహిమీదనెల్లపుడు
కొనియాడి మ్రొక్కెదను కోర్కెదీర
IIజయమంగళం నిత్య శుభమంగళంII

Share this Story:

Follow Webdunia telugu