Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

108 గణపతులకు పూజ: సింధు మీనన్

108 గణపతులకు పూజ: సింధు మీనన్
హైదరాబాద్ (ఏజెన్సీ) , శనివారం, 15 సెప్టెంబరు 2007 (16:52 IST)
WD PhotoWD
విఘ్నేశ్వరుణ్ని పూజించటం ఆర్ష సంప్రదాయం. విఘ్నేశ్వరుడు పుట్టిన భాద్రపద శుక్ల చతుర్థినాడు ఆయన్ని భక్తితో పూజించి వ్రతాన్ని ఆచరించినవారికి విఘ్నాలు ఏనాడూ బాధించవనీ, సిద్ధి కలుగుతుందనీ శివశాసనం. ఎవరికివారు తమ రీతులలో పూజిస్తారు. ఏ రంగంలో ఉన్నవారైనా తమకు ఎదురయ్యే సర్వ విఘ్నాలు తొలగాలని పూజలు నిర్వహిస్తారు.

తానెక్కడున్నా ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి గణేశుని కొలుస్తానని సింధుమీనన్ అంటోంది. భద్రాచలంతో తెలుగువారికి పరిచయం అయిన ఈ కేరళ భామ తన ఏడేళ్ల నుంచి తన సోదరుడు మనోజ్ చేసే పూజలే ఇంకా తన కళ్లముందు మెదులుతాయంటోంది. విఘ్నాలు తప్పించే వినాయకుడు తన జీవితంలో ఓ యాక్సిడెంట్ నుంచి కాపాడాడని చెబుతోంది. వెబ్‌దునియా తెలుగుతో సింధుమీనన్‌ ముచ్చట్లు...

వెబ్‌దునియా: చిన్నప్పుడు వినాయక చవితిని ఎలా జరుపుకున్నారు?
సింధు: మేము మలయాళీయల. మా ఇంట్లో ఫార్మల్‌గా వినాయకుడిని పూజించటం వరకే. నా ఏడవ ఏట నుంచి చవితినాడు బయట పూజలు చేయటం తెలుసు. మా అన్న మనోజ్ మాత్రం చుట్టు పక్కల స్నేహితులందరినీ పోగుచేసి హడావుడి చేసేవాడు. అప్పుడు బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో ఉండేవాళ్లం. అక్కడ మూడురోజులు చేస్తారు. అక్కడ 108 గణపతులు ఉండే గుడి ఉండేది. అక్కడికెళ్లి 108 గణపతులను పూజించేవారంతా. చుట్టుపక్కల భక్తులంతా కలిసి అలా పూజలు చేయటంతో మూడురోజులు పట్టేది.

వెబ్‌దునియా: అప్పటి పూజా విధానానికి ఇప్పటి పూజా విధానానికి ప్రస్తుత బిజీలో ఏదైనా తేడా ఉన్నట్లు అనుకుంటున్నారా?
సింధు: ఇప్పటి పరిస్థితులరీత్యా గుడికి వెళ్లలేకపోతున్నాం. చిన్నప్పటి సంగతులు గుర్తుకుతెచ్చుకుంటే అప్పటి రోజులే మంచివనిపిస్తుంది. ఇప్పటి బిజీ లైఫ్‌లో చాలా మిస్ అవుతున్నామనిపిస్తుంది. ఈ వినాయక చవితిని హైదరాబాద్‌లో జరుపుకుంటున్నాను. నాతోపాటు అమ్మకూడా ఉంది. ఇద్దరం ఇక్కడే చిన్నవినాయకుడిని తీసుకువచ్చి పూజ చేస్తాం.

వెబ్‌దునియా: హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జనంలో ఎప్పుడైనా పాల్గొన్నారా?
సింధు: లేదు. కానీ అవి చూస్తుంటే.. చిన్నతనంనాటి రోజులు గుర్తుకువస్తాయి. నా సోదరుడు కూడా అందరినీ సమీకరించి ఇలానే నిమజ్జన కార్యక్రమాలు జరిపేవాడు.

వెబ్‌దునియా: విఘ్నాలకు అధిపతి వినాయకుడంటారు. మీ జీవితంలో విఘ్నాలను అధిగమించిన సంఘన ఏమైనా జరిగిందా?
సింధు: నేను రోజూ వినాయకిణ్ణి పూజిస్తాను. వారం రోజులనాడు నాకొక యాక్సిడెంట్ జరిగింది. చిన్నపాటి గాయాలతో బయటపడ్డాను. ఓ చోట రోడ్ క్రాస్ చేస్తుంటే చాలా స్పీడ్‌గా బైకులో వస్తున్న వ్యక్తి నన్ను ఢీకొట్టాడు. అనుకోకుండా ఎవరో తోసినట్లు నేను కాస్త వెనక్కి జరగటంతో ప్రమాదం తప్పి చిన్నపాటి గాయాలతో బయటపడ్డాను. ఆ సంఘటన తలచుకుంటేనే భయమేస్తుంది. చందమామ పబ్లిసిటీలో భాగంగా ఓ ఛానల్ ఇంటర్య్యూకు వెళుతూ రోడ్డు దాటుతున్నాను ఆరోజు. నిజంగా నన్ను ఆ గణేశుడే ఆదుకున్నాడు.

ఏదేమైనా వినాయకుడ్ని నమ్ముకుంటే సమస్యలు తీరిపోతాయి. నా విషయంలో తల్లిదండ్రులు, అన్నా చెల్లెలు ఇలా చక్కని కుటుంబంతో గడిపే జన్మని ప్రసాదించాడు. చాలామందిని పరిశీలిస్తే వాళ్లకు లేనివీ నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంటుంది. అందుకే ఏ పని చేయాలనుకున్నా ముందుగా వినాయకుడిని స్మరించుకుంటాను.

Share this Story:

Follow Webdunia telugu